Suma Son Roshan Movie Vs Sunitha Son Movie :తెలుగులో టాప్ యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యాంకర్ సుమ. అటు టీవీ షోల నుంచి ఇటు సినిమా ఈవెంట్స్ వరకు అన్నీ కవర్ చేసేస్తుంటారు. సెలబ్రిటీలు ఇంటర్వ్యూలను కూడా నిర్వహిస్తుంటారు. అయితే సుమ, రాజీవ్ కనకాల ఏకైక కుమారుడు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
మరోవైపు, టాలీవుడ్లో ఎన్నో హిట్ సాంగ్స్ పాడడమే కాకుండా అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు సింగర్ సునీత. ఆమె కుమారుడు ఆకాశ్ సర్కారి నౌకరీ సినిమాలో వెండితెరకు పరిచయమవుతున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలు మూడు రోజుల తేడాతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కుమారులు హీరోలుగా అడుగుపెడుతున్న సమయంలో సుమ, సునీత ప్రమోషన్లలో బిజీగా ఉన్నారట.
రొమాంటిక్ అండ్ యూత్ పుల్ కంటెంట్
Suma Son Roshan Movie Trailer : అయితే రోషన్ నటించిన బబుల్ గమ్ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. మంచి రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ కంటెంట్‌తో ఆ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ కారణంగా సినిమాకు కొంత బజ్ ఉంది.