'రంగస్థలం'.. ఈ సినిమా చేసిన మ్యాజిక్కే వేరు. సుక్కు టేకింగ్, రామ్‌చరణ్ నటన సినీప్రేక్షకులను ఫిదా చేసింది. చరణ్ నటనను మరోస్థాయికి తీసుకెళ్లింది. గ్రామీణ నేపథ్యంలో సాగే మాస్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. దీంతో ఈ క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తే చూడాలని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబోలో ఓ సరికొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే హీరో పరిచయ సన్నివేశాలు కూడా చిత్రీకరించారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ వెల్లడించారు.
''రామ్‌చరణ్-సుకుమార్ కాంబోలో ఓ ప్రాజెక్ట్ రానుంది. 'ఆర్‌ఆర్‌ఆర్'లో రామ్‌చరణ్ శరీరాకృతిని మెచ్చిన ఆయన.. తన ప్రాజెక్ట్‌లోనూ చెర్రీని అదే లుక్స్‌లో చూపించనున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' రిలీజ్‌కు ముందే పది నిమిషాలు నిడివి ఉన్న హీరో ఇంట్రో సీన్స్ చిత్రీకరించారు'' అని సాబు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ''ఇదెక్కడి ట్విస్ట్ మావ.. చరణ్ తదుపరి ప్రాజెక్ట్స్‌కు సంబంధించి చాలామంది దర్శకుల పేర్లు విన్నాం. కానీ, ఇది మాత్రం ఊహించలేదు'', ''వెయిటింగ్'', ''ఇది.. సూపర్ న్యూస్'' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.