తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Suhas New Movie : అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. సౌండ్ అదిరింది.. సుహాస్ యాక్టింగ్ కేక - Ambajipeta Marriage Band release date

Suhas New Movie : కలర్‌ఫొటో, రైటర్‌ పద్మభూషణ్‌ ఫేమ్​ సుహాస్‌ కొత్త సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

Suhas New Movie : అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. గుండు లుక్​లో సుహాస్ యాక్టింగ్​ కేక!
Suhas New Movie : అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. గుండు లుక్​లో సుహాస్ యాక్టింగ్​ కేక!

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 5:45 PM IST

Suhas New Movie :షార్ట్‌ ఫిల్మిస్​, యూట్యూబ్‌ వీడియోస్‌తో కెరీర్‌ ప్రారంభించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సుహాస్‌. కలర్‌ఫొటో, రైటర్‌ పద్మభూషణ్‌, ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 వంటి చిత్రాలతో నేచురల్ యాక్టర్​గా యూత్​లో కాస్త క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడు అంబాజీపేట మ్యారేజి బ్యాండు అనే విలేజ్ డ్రామాలో నటించాడు. దుశ్యంత్‌ కటికినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీమ్​.. టీజర్​ లాంఛ్ ఈవెంట్​ను గ్రాండ్​గా నిర్వహించింది. సౌండ్ దద్దరిల్లిపోతుంది.. అంటూ టీజర్​ను విడుదల చేసింది.

Ambajipeta Marriage Band Teaser :చెప్పవే చిరునామా అంటూ బ్యాండ్​ మ్యూజిక్​తో మొదలైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం లవ్​ కమ్​ ఫన్​ రైడ్​, యాక్షన్​తో సాగింది. మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్‌ కనిపించారు. హీరోహీరోయిన్​ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగుంది. సుహాస్ కాస్త​ సీరియస్​ యాక్టింగ్​తో పాటు ఫైటింగ్​లు కూడా చేశారు​. చివర్లో ఏదో కోల్పోయి గుండు కూడా గీయించుకున్నట్టు కూడా కనిపించారు. ఇక శేఖర్‌ చంద్ర అందించిన మ్యూజిక్​ కూడా బాగుంది.

ఈ సినిమాలో గోపరాజు రమణ, పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి ఇతర కీలక పాత్రల్లో నటించారు. చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా కలిసి నిర్మించాయి. మహాయానా మోషన్ పిక్చర్స్.. డైరెక్టర్ వెంకటేశ్ మహాకు చెందిన నిర్మాణ సంస్థే. ఇంకా ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర - సంగీతం అందించగా.. వాజిద్‌ బేగ్‌ - సినిమాటోగ్రఫీ అందించారు.

కాగా, రీసెంట్​గా రైటర్ పద్మభూషణ్​ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బాగా దగ్గరయ్యారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ బేస్ పెరిగింది. మొత్తంగా సుహాస్​... భిన్న జోనర్స్​లో సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. అందుకే ఆయన సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇకపోతే సుహాస్​.. రామ్‌ పసుపులేటి దర్శకత్వంలో ఆనందరావ్‌ అడ్వంచర్స్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. త్వరలోనే ఇది కూడా రిలీజ్ కానుంది.

Bhagwant Kesari Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరోస్​.. ఆ విష‌యంలో బాల‌య్య ముంద‌డుగు!

Comedian Dhanraj Direction : వేణు బాటలోనే ధన్​రాజ్​.. త్వరలో డైరెక్టర్​గా.. 'బలగం' లాంటి స్క్రిప్ట్ రెడీ!

ABOUT THE AUTHOR

...view details