తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సుడిగాలి సుధీర్ 'కాలింగ్ సహస్ర' రిలీజ్​ డేట్​ ఫిక్స్- మరి రష్మితో సినిమా ఎప్పుడంటే! - సుధీర్ రష్మి సినిమా

Sudigali Sudheer Rashmi Movie : సుడిగాలి సుధీర్ హీరోగా వస్తున్న సినిమా 'కాలింగ్ సహస్ర'. ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఆ చిత్రం ప్రమోషన్స్​లో భాగంగా సుధీర్​ ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మితో సినిమా గురించి చెప్పారు. ఇంతకీ ఏమన్నారంటే?

Sudigali Sudheer Rashmi Movie
Sudigali Sudheer Rashmi Movie

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 7:37 PM IST

Sudigali Sudheer Rashmi Movie : జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్. ఆయన కామెడీ టైమింగ్, స్టైల్​ను ఇష్టపడే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఈ ఇమేజ్​ను చూసి సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు దర్శక నిర్మాతలు. మొదట్లో కమెడియన్​గా చిన్న పాత్రలో నటించిన సుధీర్.. 2019లో 'సాఫ్ట్​వేర్ సుధీర్' సినిమాతో హీరోగా మారారు. తాజాగా 'కాలింగ్ సహస్ర' అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 1న వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా మంగళవారం ట్రైలర్​ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సుధీర్ మాట్లాడారు. రష్మి హీరోయిన్​గా సినిమా ఎప్పుడు చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు సుధీర్​ స్పందించారు. "నేను, రష్మి కథలు వింటున్నాం. మా ఇద్దరికీ కామన్‌గా నచ్చిన కథ ఇప్పటి వరకు దొరకలేదు. ఒకవేళ అలాంటిది దొరికితే కచ్చితంగా మేము కలిసి నటిస్తాం. ఆ ప్రపోజల్ అయితే ఉంది." అని సుధీర్ చెప్పారు.

మరోవైపు.. 'కాలింగ్​ సహస్ర' గురించి సుధీర్​ మాట్లాడారు. 'ఈ రోజుల్లో ఒక సినిమా హిట్​ అయితే దానికి ముఖ్య కారణం స్టోరీ. ఈ సినిమాకు కూడా అదే బలం. సుధీర్​ను దృష్టిలో పెట్టుకుని కాకుండా ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలని వెళ్తే ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్​ చేస్తారు. ఇది నా మూడో చిత్రం. నా సినిమాలతో నిర్మాతలకు లాభాలు వస్తే చాలు. అలాగే వచ్చిన జనాలు కూడా సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ఆనందిస్తా. దర్శకుడు ఏది చెబితే అదే నేను చేస్తాను. కానీ, సలహాలు సూచనలు ఏం ఇవ్వను' అని సుధీర్​ తెలిపారు.

ఇక సినిమా విషయానికొస్తే.. డాలీషా , స్పందన పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివ బాలాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. అరుణ్​ విక్కిరాల దర్శకత్వం వహిస్తున్నారు. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధ ఆర్ట్స్ బ్యానర్లపై విజేష్ కుమార్ తాయల్, చిరంజీవి పామిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మించారు. మోహిత్ రెహ్మానియాక్ సంగీతాన్ని అందిస్తున్నారు.

బడా డైరెక్టర్​తో సుధీర్ భారీ బడ్జెట్ సినిమా! విలన్​గా స్టార్ హీరోయిన్?

Rashmi Gautam Latest Photos : బాత్ టబ్‌లో స్నానం చేస్తూ రష్మి హాట్​ పిక్స్​.. లాస్ట్ రెండు ఫొటోలు​ సూపర్​​ భయ్యా!

ABOUT THE AUTHOR

...view details