తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Krish 4 సర్​ప్రైజ్​, ఈ సారి హృతిక్​తో పాటు ఆ సౌత్​ స్టార్ హీరో - Hrithik roshan Krish 4 story

Hrithik Roshan Krish 4 క్రిష్​ 4 కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హృతిక్​ రోషన్​తో పాటు మరో సౌత్​ స్టార్​ హీరో కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఆ వివరాలు.

krish 4 south star hero
క్రిష్​ 4లో సౌత్ స్టార్ హీరో

By

Published : Aug 18, 2022, 3:04 PM IST

Hrithik Roshan Krish 4 హృతిక్‌ రోషన్‌ సూపర్​ హీరో పాత్రలో నటించిన 'క్రిష్‌' సిరీస్‌ చిత్రాలకు ఎంతోమంది అభిమానులున్నారు. మానవాతీత శక్తులు కలిగిన 'క్రిష్' విన్యాసాలకు అప్పట్లో దేశం మొత్తం అబ్బురపడింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌లో 'క్రిష్‌ 4' రానున్న సంగతి తెలిసిందే. రెండేళ్లుగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది ఓ కొలిక్కి రావట్లేదు. ఇంకా జాప్యం కొనసాగుతోంది.

గతేడాది ఈ చిత్రంపై హృతిక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్‌ చేశాడు. క్రిష్ పాత్ర పుట్టి 15సంవత్సరాలైన సందర్భంగా అభినందనలు చెబుతూ 'గతం వెళ్లిపోయింది. భవిష్యత్‌లో ఏం జరగనుందో చూద్దాం.. క్రిష్‌-4' అంటూ కీలక అప్డేట్​ను ఇచ్చారు. అక్కడి నుంచి ఈ సినిమాపై విపరీతమైన ప్రచారం జరగడంతో దర్శకుడు రాకేశ్‌ రోషన్‌ 'క్రిష్‌-4 కథ సిద్ధమవుతోంది. ఎప్పుడు ప్రారంభమవుతుందనేది మేమే ప్రకటిస్తాం' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. క్రిష్ చిత్రాల పరంపరను ప్రత్యేకంగా కొనసాగిస్తున్న రోషన్‌ ఫ్యామిలి 'క్రిష్‌-4'ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నట్లు ప్రచారం సాగుతోంది. క్రిష్‌ చిత్రాల రచయిత హనీ ఇరానీ కథ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్‌-4 స్టోరీలైన్‌పై బాలీవుడ్‌లో పలు కథనాలు వార్తలుగా వస్తున్నాయి. అందులో ముఖ్యంగా క్రిష్-3 ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే క్రిష్-4 ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

అంతరిక్ష నేపథ్యం, టైమ్‌ ట్రావెల్ స్టోరీగా ఈ సినిమా రానున్నట్లు సమాచారం. ముఖ్యంగా క్రిష్‌ తండ్రి రోహిత్‌ మెహ్రాను టైం ట్రావెల్‌ సహాయంతో వెనక్కి తీసుకురావడమే (బ్రింగ్‌ బ్యాక్‌ రోహిత్‌ మెహ్రా) ప్రధానాంశంగా క్రిష్‌-4 కథనం ఉంటుందన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'జాదు'కి కూడా కీలకపాత్ర ఉంటుందట. మరోవైపు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారని, ప్రధాన పాత్రను హృతిక్‌ పోషించగా, సౌత్‌ ఇండస్ట్రీ నుంచి మరో పెద్ద హీరోని కూడా దృష్టిలో పెట్టుకుని సినిమా కథ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా 'క్రిష్‌-4'ను అత్యాధునిక సూపర్‌ హీరో సైన్స్‌ ఫిక్షన్‌గా రూపొందించనున్నారట.

ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ 'విక్రమ్‌ వేద'లో నటిస్తున్నారు. దీని తర్వాత భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రం 'ఫైటర్‌' ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 'ఫైటర్‌' ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మరోవైపు క్రిష్-4 కథ సిద్ధమవుతోంది. మరి క్రిష్‌-4 ముందొస్తుందా? లేక 'ఫైటర్‌' వస్తుందా అనేది ప్రకటించాల్సి ఉంది.

ఇదీ చూడండి: శ్రద్దాదాస్​ ముద్దు కోసం హైపర్​ ఆది సాహసం, ఏం చేశాడంటే

ABOUT THE AUTHOR

...view details