తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బాలకృష్ణకు సోనాక్షి గ్రీన్​సిగ్నల్​ ఇస్తుందా? - బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా

Balakrishna anilravipudi: బాలకృష్ణ-అనిల్​రావిపూడి సినిమా కోసం బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఆమెకు కథ వినిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Balakrishna Sonakshi simha
బాలకృష్ణ కోసం సోనాక్షి

By

Published : Jul 29, 2022, 6:28 AM IST

Balakrishna Sonakshi simha: బాలకృష్ణ నటించనున్న 108వ సినిమా ఇప్పటికే ఖరారైంది. దీనికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో.. బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారు. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించనుంది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ప్రియమణి పేరు పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కానీ, ఇప్పుడీ పాత్రకు చిత్ర బృందం సోనాక్షిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. త్వరలో ఆమెకు కథ వినిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా నటించిన 'డబుల్‌ ఎక్స్‌ఎల్‌' విడుదలకు సిద్ధమవుతోంది.

కాగా, బాలయ్య ప్రస్తుతం గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో 'ఎన్​బీకే 107'లో నటిస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ సహా అక్కడి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. శ్రుతిహాసనే హీరోయిన్​. కన్నడ స్టార్​ దునియా విజయ్​కుమార్​ ప్రతినాయకుడిగా కనిపిస్తుండగా, వరలక్ష్మీ శరత్​కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్​ నిర్మిస్తోంది. తమన్​ సంగీతం అదిస్తున్నారు.

ఇదీ చూడండి:ఎల్లో డ్రెస్​లో ఎవర్​గ్రీన్​గా చాందిని.. డుగ్​-డుగ్​ అంటూ డింపుల్​ హయాతి

ABOUT THE AUTHOR

...view details