తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆరోజు నటనకు గుడ్​బై చెప్తానన్న సిద్ధార్థ్‌.. వరుస ప్రాజెక్ట్​లతో విక్రమ్​ జోరు - సిద్ధార్థ్​ కామెంట్స్​ యాక్టింగ్​ కు గుడ్ బై

Siddharth Retirement acting: నటనకు స్వప్తి పలకడంపై నటుడు సిద్ధార్థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం రానప్పుడు యాక్టింగ్ కెరీర్​కు గుడ్​బై చెబుతానన్నారు. ఇక వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ.. కెరీర్​లో ముందుకెళ్తోన్న కథానాయకుడు విక్రమ్‌ మరో రెండు కొత్త ప్రాజెక్ట్​లను లైన్​లో పెట్టినట్లు తెలుస్తోంది.

Siddharth Retirement acting
సిద్ధార్థ్​ నటనకు గుడ్ బై

By

Published : May 14, 2022, 10:32 AM IST

Siddharth Retirement acting: లవర్‌ బాయ్‌ ఇమేజ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్ధార్థ్‌. చాలాకాలం తర్వాత 'మ‌హాస‌ముద్రం' సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఎస్కేప్‌ లైవ్‌ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ సిరీస్‌ డిస్నీ+హాట్ స్టార్​లో లో మే 20 నుంచి ప్రీమియ‌ర్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్‌ పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. నటనకు స్వప్తి పలకడంపై నటుడు సిద్ధార్థ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. "నటుడిగా నా కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి నేను ఎక్కువగా దక్షిణాది చిత్రాల్లోనే నటించాను. అందువల్ల చాలామంది నేను దిల్లీ అబ్బాయిననే విషయాన్ని మర్చిపోయారు. హిందీ చాలా బాగా మాట్లాడతాను. ఆసక్తికరమైన పాత్రలు వచ్చినప్పుడల్లా హిందీ చిత్రాల్లో నటిస్తుండటం ఒక అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్‌ కుమార్‌ 'ఎస్కేప్‌ లైవ్‌' కథ చెప్పారు. కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఓకే చేశాను. ఆసక్తికరమైన పాత్రల్లో నటించే అవకాశం వచ్చినంతవరకూ నేను సినిమాల్లో నటిస్తాను. అలాంటి అవకాశాలు రానప్పుడు తప్పకుండా నటనకు స్వస్తి పలికి వేరే ఉద్యోగం వెతుక్కుంటా" అని సిద్దార్థ్‌ పేర్కొన్నారు.

కాగా, శంకర్‌ తెరకెక్కించిన 'బాయ్స్‌'తో హీరోగా పరిచయమైన సిద్ధార్థ్‌ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా..!', 'బొమ్మరిల్లు', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ఓ మై ఫ్రెండ్‌' ఇలా పలు ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఆయన నటించిన తెలుగు చిత్రం 'మహాసముద్రం'. గతేడాదిలో విడుదలైన ఈసినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

Tamil star hero Vikram: వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు సాధించుకున్నారు కథానాయకుడు విక్రమ్‌. ఆయన ఇటీవలే అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో 'కోబ్రా'లో నటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. ఈ మూవీ తర్వాత ఆయన ఏ చిత్రంలో నటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. విక్రమ్, దర్శకుడు పా.రంజిత్‌ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రూపొందబోతున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పడీ సినిమా కోసమే ఆయన సిద్ధమవుతున్నారని టాక్​ వినిపిస్తోంది. మరోవైపు.. 'కోబ్రా' దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తుతోనే మరో సినిమా చేసేందుకు ఆయన గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలిసింది. మరి ఈ రెండు చిత్రాల్లో ఆయన దేన్ని ముందుగా సెట్స్​పైకి తీసుకెళ్తారో చూడాలి.

ఇదీ చూడండి:Niharika Nm: ఈమె డేట్స్‌ కోసం స్టార్​ హీరోలు క్యూ!

ABOUT THE AUTHOR

...view details