రిలీజ్‌కు ముందు అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ బాయ్‌కాట్ గ్రూప్ సామాజిక వేదికలో గళమెత్తింది. అయితే కట్ చేస్తే ఇదే సినిమా ఇప్పుడు 'టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ'గా మారింది. అదే షారుక్ 'పఠాన్' మూవీ. జనవరి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.313 కోట్ల (గ్రాస్) బిజినెస్ చేసి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హిందీ సినిమాగా రికార్డుకెక్కగా ఇప్పుడు ఈ రికార్డును కూడా బద్దలుకొడుతూ దూసుకెళ్తోంది.
నాలుగో రోజు కూడా తగ్గని కలెక్షన్ల వర్షం.. బాలీవుడ్ బాద్షా సృష్టిస్తున్నాడుగా నయా రికార్డులు..! - పఠాన్ నాల్గవ రోజు కలెక్షన్స్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్. రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది.
భారత్‌లో ఈ సినిమా నాల్గవ రోజు 55 కోట్లు వసూలు చేసింది. కాగా తొలిరోజు రూ. 57 కోట్లు, రెండో రోజు రూ.70.50 కోట్లు, మూడో రోజు రూ.39.25 కోట్లు వసూళ్లు చేసింది. రిప్లబిక్‌డే కు హాలిడే కావడంతో ఆ రోజు అత్యధిక స్థాయిలో టిక్కెట్లు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. విడుదలైన రోజే రూ. 106 కోట్లు సాధించిన ఈ సినిమా బీటౌన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. కాగా రెండు, మూడో రోజులు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణెలు కీలక పాత్రలు పోషించారు. యష్ రాజ్ ఫిలీంస్ నిర్మణ సంస్థలో తెరకెక్కిన ఈ సినిమాకు మొదట బాయ్ కాట్ సెగ గట్టిగానే తగిలింది. కానీ వాటన్నిటిని అధిగమించి షారుఖ్ పఠాన్ దూసుకెళ్తోంది. అనేక బాలీవుడ్ రికార్డులను ఇట్టే బద్దలు కొడుతోంది.