బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలై 11 రోజులైనా ప్రేక్షకుల్లో మూవీ క్రేజ్ తగ్గట్లేదు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.780 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మేరకు యష్‌రాజ్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక, హిందీలో అత్యంత వేగంగా రూ.400 కోట్ల ఎన్బీఓసీ(నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్) కలెక్షన్ల మార్కును దాటిన చిత్రంగా 'పఠాన్' నిలిచిందని.. ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్ బాహుబలి(15 రోజుల్లో), కేజీఎఫ్(23 రోజుల్లో) ఉన్నాయి.
భారీ వసూళ్లతో బాక్సాఫీసును షేక్ చేస్తున్న 'పఠాన్'.. రూ. 780 కోట్ల కలెక్షన్స్! - షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్
బాలీవుడ్ బాద్ షా నటించిన పఠాన్ కలెక్షన్స్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల జోరును కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 780 కోట్ల కలెక్షన్లు సాధించింది. 11వ రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
పఠాన్ మూవీ బాక్సాఫీసు కలెక్షన్స్
ఇప్పటి వరకు ఈ చిత్రం దేశంలో రూ.481 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఓవర్సీస్ మార్కెట్లో రూ.299 కోట్ల కలెక్షన్లను రాబట్టిందని సినీ వర్గాల సమాచారం. కాగా, ఈ చిత్రంలో షారుఖ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషించారు. గెస్ట్ రోల్లో బాలీవుడ్ బిగ్‌బాస్ సల్మాన్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ సంగీతాన్ని సమకూర్చారు.