తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

''డంకీ'ని స్టేడియాల్లో ప్రదర్శించండి'- నెటిజన్ రిక్వెస్ట్​కు కింగ్ ఖాన్​ ఫన్నీ రిప్లై - షారుక్ ఖాన్​ ట్వీట్స్

Shahrukh Khan Dunki Movie : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్​ ప్రస్తుతం 'డంకీ' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా తాజాగా పలు ఇంట్రెస్టింగ్​ విషయాలు పంచుకున్నారు. అవేంటంటే..

Shahrukh Khan Dunki Movie
Shahrukh Khan Dunki Movie

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 9:29 PM IST

Shahrukh Khan Dunki Movie : వరుస హిట్స్​తో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు బాలీవుడ్​ బాద్​షా షారుక్‌ ఖాన్‌. 'పఠాన్‌', 'జవాన్‌' లతో సరికొత్త రికార్డులు సృష్టించిన కింగ్ ఖాన్​.. త్వరలో 'డంకీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజ్‌కుమార్‌ హిరాణీ రూపొందించిన ఈ సినిమా డిసెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్​తో బిజీగా ఉన్నా షారుక్.. తన అభిమానుల కోసం కొంత సమయాన్ని కేటాయించారు. సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా Ask Me SRK సెషన్​ ద్వారా వారితో కాసేపు ముచ్చటించారు. ఆ సంగతులు మీ కోసం..

'డంకీ'.. అంటే ఏంటి?
షారుక్‌: అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడాన్ని డంకీ అంటుంటారు. దీన్ని ఒక్కొక్కరు ఒక్కోలా పలుకుతున్నారు!

టికెట్‌ కొనకుండా 'డంకీ' స్టైల్‌లో థియేటర్‌లో ఆ సినిమా చూడొచ్చా?
షారుక్‌:నేను చిన్నతనంలో డబ్బుల్లేకుండా సినిమాలు చూడాలనుకుంటే ప్రొజెక్షనిస్ట్‌ను (ఫిల్మ్‌ ప్రొజెక్టర్‌ను ఆపరేట్‌ చేసే వ్యక్తి) కాకా పట్టేవాడిని. దీన్ని మీరూ ప్రయత్నించండి. బహుశా పని అవ్వొచ్చేమో! నేను ఈ విషయం నీకు చెప్పినట్లు ఎవరికీ చెప్పకు. ఇది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన రహస్యం.

'డంకీ'ని థియేటర్లలోకాకుండా స్టేడియాల్లో ప్రదర్శించండి. ఇది నా విజ్ఞప్తి.
షారుక్‌: నేను కూడా మా టీమ్‌కు ఇదే చెప్పాను. కానీ, అలా చేస్తే ఏసీ ఉండదు కదా. అది లేకపోవడం కూడా ఓ సమస్య అవుతుంది. మీరు పిల్లలు, పెద్దలతో కలిసి సినిమాకు వెళ్తే అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే డిసెంబరు 21 'డంకీ'ని థియేటర్లలో చూడండి.

టెన్షన్‌ నుంచి మీరు ఎలా బయటపడతారు?
షారుక్‌:నెర్వస్‌గా ఫీలైన సమయంలో దాని నుంచి బయటపడేందుకు పెన్​, పేపర్‌ తీసుకుని నాకు తోచింది రాస్తాను. పిల్లలతో సరదాగా ఆడుకుంటాను.

షారుక్‌ ఖాన్‌.. ప్రేమకు పర్యాయపదం.
షారుక్‌:మరి, సెక్సీకి పర్యాయపదం ఏంటి బ్రో?

తాప్సీతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
షారుక్‌:తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ చాలా ప్రతిభావంతులు. నేను బాగా నటించేందుకు వారు నాకు సాయం చేస్తున్నారు. వీరితో పాటు ఇందులో నటించిన మిగిలిన నటీనటులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఇటీవల విడుదలైన 'డంకీ'లోని కొత్త పాటను చూశాను. 58 ఏళ్ల వయసులో చిన్న పిల్లాడిలా ఇంత ఎనర్జిటిక్‌గా ఎలా నటించారు?
షారుక్‌:మా ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడు. అతడి అమాయకత్వాన్ని, శక్తిని చూసి నాకు ముచ్చటేసేది. పాటల విషయంలో అతడిని గుర్తుచేసుకుని నేనూ చిన్న పిల్లాడిని అయిపోయాను.

బడ్జెట్​ రూ.124 కోట్లు- కలెక్షన్​ రూ.3,145 కోట్లు- షారుక్ ఖాన్​ వదులుకున్న ఆ సూపర్ హిట్​ మూవీ ఏదంటే?

బాద్​ షా బర్త్​ డే ట్రీట్​ - కామెడీ అండ్​ ఎమోషనల్​ డ్రామాగా 'డంకీ' టీజర్​​

ABOUT THE AUTHOR

...view details