Shah Rukh Khan Iconic Pose : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆయన పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది 'దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే'లోని ఐకానిక్ పోజ్. ఆ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 28 ఏళ్లైనా.. షారుక్ ప్రతి ఫంక్షన్‌లోనూ ఈ పోజ్‌ను రీక్రియేట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడిదే పోజ్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. అదెలా అంటే?
షారుక్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్‌బస్టర్ పఠాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా వచ్చే ఆదివారం ఓ ఛానల్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం షారుక్.. తన నివాసమైన మన్నత్ ఎదుట అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు.
అనంతరం ఆయన ఐకానిక్ పోజ్ రీక్రియేట్ చేశారు. దాంతో పాటు పఠాన్ పాటకు కాలు కదిపారు. ఈ మీట్ అండ్ గ్రీట్‌లోనే పఠాన్‌ను ప్రసారం చేయనున్న సదరు ఛానల్ నిర్వాహకులు సుమారు 300 షారుక్ అభిమానులతో ఆయన ఐకానిక్ పోజ్‌ను రీక్రియేట్ చేయించి.. గిన్నిస్ రికార్డు అందుకున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.