తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆ పోస్ట్​తో మళ్లీ వార్తల్లో సమంత.. ఎప్పటికీ ఒంటరిగా నడవరంటూ.. - సమంత లేటస్ట్​ అప్డేట్స్​

హీరోయిన్ సమంతో సోషల్​మీడియాలో పెట్టే పోస్టులు.. అర్థంకాక అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరిని ఉద్దేశించి అంటోంది, అసలు ఆమె ఏమి చెప్పాలనుకుంటోంది అని కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఆమె ఏం పోస్ట్ చేసిందంటే..

samantha post online
samantha instagram post

By

Published : Oct 11, 2022, 3:43 PM IST

కొంత కాలంగా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న హీరోయిన్​ సమంత​ మళ్లీ యాక్టివ్​ అయ్యింది. రీసెంట్​గా ఓ పోస్ట్​ చేసి మళ్లీ హాట్​ టాపిక్​గా మారిన సామ్​.. ఇన్​స్టాలో మరో పోస్ట్​ చేసింది. "ఒకవేళ మీరు ఇది వినాల్సి వస్తే.. మీరెప్పటికి ఒంటరిగా నడవరు" అంటూ తన మొఖం కనపడకుండా కేవలం తన టీషర్ట్​ కనపడేలా ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అంతకుముందు తన పెంపుడు కుక్క ఫోటో షేర్ చేస్తూ.. వెనక్కు తగ్గాను.. కానీ ఓడిపోలేదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొన్ని రోజుల పాటు సైలెంట్​గా ఉన్న సామ్​ మళ్లీ సడెన్​గా ఇలాంటి పోస్టులు పెట్టేసరికి.. ఫ్యాన్స్​లో పలు అనుమానాలు వస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరిని ఉద్దేశించి ఇలా చేస్తుంది, అసలు ఆమె ఏమీ చెప్పాలనుకుంటోంది అని కామెంట్లు పెడుతున్నారు.

కాగా, గత కొద్ది రోజులుగా సమంత ఎటువంటి పోస్ట్​లు చేయకపోయేసరికి.. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతోందన్న రూమర్స్ వచ్చాయి. ఆమె ఓ అరుదైన చర్మ సమస్యతో ఇబ్బంది పడుతోందని దానికి చికిత్స తీసుకునేందుకు విదేశాలకు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అది అవాస్తవని సామ్​ మేనేజర్​ క్లారిటీ ఇచ్చాడు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని.. ప్రస్తుతం ఆరోగ్యాంగానే ఉన్నారని తెలిపాడు. ఇక సామ్ త్వరలోనే 'యశోద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటే ఖుషి చిత్రంలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్​లోనూ వరుణ్ ధావన్​తో కలిసి 'సిటాడెల్' చిత్రం చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details