Samantha Production House Tralala Moving Pictures :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో కొత్త ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ఆదివారం తెలిపారు. ఆ సంస్థకు 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అనే పేరు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా లోగోను షేర్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.
కొత్త తరం భావాలను వ్యక్తీకరించే, వారి ఆలోచనలను ప్రతిబింబించే కంటెంట్ రూపొందించడమే తన నిర్మాణ సంస్థ లక్ష్యం అని సమంత తెలిపారు. ' ఈ నిర్మాణ సంస్థ మన సోషల్ ఫ్యాబ్రిక్ బలం, సంక్లిష్టత గురించి తెలిపే కథలను ఆహ్వానించి వాటిని చిత్రరూపం ఇస్తుంది. అంతేకాకుండా అర్థవంతమైన ప్రామాణికమైన, విశ్వవ్యాప్తమైన కథలను చెప్పడానికి ఈ సంస్థ ఫిల్మ్ మేకర్స్‌కు ఒక వేదిక' అని పోస్టులో పేర్కొన్నారు.
'ట్రాలాలా' ఎందుకంటే?
Tralala Production House : సమంత తాజాగా ప్రకటించిన నిర్మాణ సంస్థ 'ట్రాలాలా' పేరు కొత్తగా ఉంది. ఈ పేరు పెట్టడానికి కారణం కూడా వెల్లడించారు సమంత. ఈ పేరును 'బ్రౌన్ గర్ల్ ఈజ్ ఇన్ ది రింగ్ నౌ' అనే పాట నుంచి స్ఫూర్తి పొంది పెట్టారట. తన చిన్నతనంలో ఈ పాట వింటూ పెరిగినట్లు సమంత వెల్లడించారు.
అయితే ఈ వెంచర్ కోసం సమంత, హైదరాబాద్‌కు చెందిన ఎంటర్టైన్మెంట్ కంపెనీ 'మండోవా మీడియా వర్క్స్‌తో' భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. 'సినిమా ప్రపంచంలో ఇంతటి అపారమైన అనుభవం ఉన్న వారితో భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు మేము ఉత్సాహంగా ఉన్నాము. మా నిర్మాణ సంస్థలో సినిమా, వెబ్, టీవీతో పాటు వివిధ ఫార్మాట్‌లలో కంటెంట్‌ను రూపొందించే విధంగా ఆలోచిస్తున్నాము' అని మండొవా మీడియా వర్క్స్ వ్యవస్థాపకుడు హిమాంక్ దువుర్రు అన్నారు.
'నటనే కాదు నిర్మాతగానూ సత్తా చాటుతాం!'
అయితే సమంత బాలీవుడ్ కథానాయికలను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామలు, నటిమణులుగానే కాకుండా నిర్మాతలుగానూ సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు. 2013లో అనుష్క శర్మ 'క్లీన్ స్లేట్ ఫిలిం' అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత 2015లో అందాల నటి ప్రియాంకా చోప్రా 'పర్‌పుల్ పెబల్ పిక్చర్స్' అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేశారు. ఇక 2020లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ 'మణికర్ణిక ఫిలిం ప్రొడక్షన్' అనే సంస్థను స్థాపించారు. తాజాగా ఆ జాబితాలో దిల్లీ ముద్దుగుమ్మ సైతం చేరారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న మరో హీరోయిన్ తాప్సీ' ఔట్ సైడర్ ఫిలిమ్స్' అనే నిర్మాణ సంస్థను ఓపెన్ చేశారు.
బాక్సాఫీసు ముందు 'యానిమల్' ర్యాంపేజ్- రూ.660 కోట్లు దాటిన కలెక్షన్స్
పెళ్లి పీటలెక్కిన ప్రముఖ కమెడియన్- నెట్టింట్లో ఫొటోలు వైరల్!