తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చైతూతో విడాకులు.. ఆ షోలో కారణం చెప్పేసిన సమంత! - సమంత నాగచైతన్య డివర్స్​

Nagachaitanya Samantha divorce: నాగచైతన్యతో ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో హీరోయిన్​ సమంత వివరించినట్లు తెలిసింది. 'కాఫీ విత్​ కరణ్​' షోలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడిండని సమాచారం! డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జులై 7న ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుందట.

Samantha nagachaitanya
చైతూతో విడాకులు.. కారణం చెప్పేసిన సమంత

By

Published : Jun 22, 2022, 9:37 AM IST

Updated : Jun 22, 2022, 9:56 AM IST

Nagachaitanya Samantha divorce: వైవాహిక జీవితానికి ముగింపు పలికిన రోజు నుంచి.. నాగచైతన్య గానీ, సమంత గానీ ఎందుకు విడాకులు తీసుకున్నారో తెలపలేదు. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎదురైనప్పటికీ సున్నితంగా పక్కకు తప్పుకున్నారు. తాజాగా ఈ విషయమై సామ్​ స్పందించినట్లు తెలిసింది. సీజన్‌-7లో భాగంగా ఇటీవలే ఆమె 'కాఫీ విత్‌ కరణ్‌' షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కెరీర్‌తో పాటు, నాగచైతన్య బంధానికి ఎందుకు ముగింపు పలకాల్సి వచ్చిందో కూడా చెప్పినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జులై 7న ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కానుందట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వార్తలు వైరల్‌ అవుతుండటం వల్ల ఈ షో ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఇటు సామ్‌ అభిమానులతో పాటు అటు చైతూ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా, సామ్ త్వరలోనే​.. శాకుంతలం, యశోద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్​దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్య నటించిన 'లాల్​ సింగ్​ చద్ధా', 'థ్యాంక్యూ' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్​లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: నాగ చైతన్య-సమంత-శోభితా ధూళిపాల.. అసలేం జరుగుతోంది?

Last Updated : Jun 22, 2022, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details