Samantha Love Tweet: నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలో బిజీగా ఉన్నారు. ఇటీవలే సామ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్' విడుదలైంది. అయితే ఈ మూవీపై వస్తున్న నెగటివ్ కామెంట్స్‌కు సమంత స్పందించారు. ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఆలోచనతోనే తాను ఈ సినిమాలో భాగమైనట్లు చెప్పారు. రోజువారీ టెన్షన్‌ను పక్కనపెట్టి సినిమాను ఎంజాయ్ చేయమని అభిమానులను కోరారు. సినిమా రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులతో ముచ్చటించారు సామ్.
తాను ఇప్పటివరకు కలిసిన వారిలో మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ నయనతార అంటూ సమంత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒకేసారి అంతులేని ప్రేమ, ద్వేషాన్ని స్వీకరించాల్సివస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందని ఓ అభిమాని ఆమెను ప్రశ్నించారు. ఆ రెండింటికి దూరంగా ఉంటానని సమాధానం ఇచ్చారు సామ్. అయితే అభిమానులు తనపై చూపించే ప్రేమకు కృతఙ్ఞతతో ఉంటానని చెప్పుకొచ్చారు. ప్రేమపై తనకు నమ్మకం లేదని ఈ సమాధానం ద్వారా సమంత చెప్పకనే చెప్పారని ఈ ట్వీట్ ఉద్దేశించి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.