తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చైతూపై సామ్​కు ఇంకా ప్రేమ తగ్గలేదా?.. మళ్లీ ఆ ఇంటిని.. - Samantha buys house

పెళ్లి తర్వాత నాగచైతన్యతో కలిసి ఉన్న ఇంటిని కొనుగోలు చేసింది హీరోయిన్​ సమంత. ఈ విషయాన్ని సీనియర్ నటుడు మురళీ మోహన్ తెలిపారు​. ప్రస్తుతం సామ్​ తన తల్లితో అక్కడే ఉంటున్నట్లు పేర్కొన్నారు.

Samantha buys Chaitanya house
నాగచైతన్య సమంత

By

Published : Jul 29, 2022, 11:05 AM IST

Updated : Jul 29, 2022, 11:23 AM IST

Samantha buys Chaitanya house: సమంత-నాగచైతన్య గురించి మరోసారి మాట్లాడారు సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌. చైతూతో కలిసి ఉన్న ఇంటిని ఎక్కువ డబ్బులు పెట్టి సామ్​ కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అక్కడే సమంత ఉంటున్నట్లు చెప్పారు.

''హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో మాకు అపార్ట్‌మెంట్స్‌ ఉన్నాయి. ఆ అపార్ట్‌మెంట్స్‌ భవనంపైన మా కుటుంబసభ్యుల కోసమే ప్రత్యేకంగా మూడు ఇళ్లను నిర్మించుకున్నాం. అందులో ఒకటి నాది, మరొకటి నా సోదరుడిది, మూడోది నా కుమారుడిది. ఓసారి చైతన్య మా అపార్ట్‌మెంట్స్‌ చూడటానికి వచ్చారు. ఆ సమయంలో మా ఇళ్లనూ చూశారు. ఆయనకు అవి బాగా నచ్చేశాయి. ఆ మూడింటిలో ఒకటి తనకి కావాలని కోరారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఆ ఇళ్లను మా కుటుంబసభ్యుల కోసమే ప్రత్యేకంగా నిర్మిస్తున్నానని చెప్పా. నా మాటతో ఆయన కాస్త నిరాశకు గురయ్యారు. ఇదే విషయంపై కొన్నిరోజుల తర్వాత నాగార్జున నన్ను సంప్రదించగా.. ఆయన మాట కాదనలేక.. ఆ మూడు ఇళ్లలో ఒకదాన్ని చైతన్యకు ఇచ్చేశా''

''పెళ్లి అయ్యాక సామ్‌-చై ఆ ఇంట్లోనే ఉన్నారు. వాళ్లిద్దరూ చూడముచ్చటైన జంట. వాకింగ్‌, జిమ్‌లో వర్కౌట్లు కలిసే చేసేవారు. ఎప్పుడూ సరదాగానే కనిపించేవారు. నాకు తెలిసినంతవరకూ వాళ్లు ఎప్పుడూ గొడవపడలేదు. తిట్టుకోవడం, ఏదైనా విషయంపై వాళ్లిద్దరి మధ్య వాగ్వాదాలు జరిగిన సంఘటనలు కూడా లేవు. ఫ్రెండ్స్‌, వీకెండ్‌ పార్టీలు.. ఇలాంటివేమీ వాళ్లింటిలో జరగవు. ఆ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉండేది. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారన్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. ఓరోజు మా ఇంట్లో పనిచేసేవాళ్లు వచ్చి.. 'సర్‌.. సామ్‌-చై విడిపోయారు. చైతన్య సర్‌.. తన సామానంతా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ' అని చెప్పగా నేను షాక్‌ అయ్యాను. అయితే పెళ్లి తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ కొనుకున్నారు. ఆ సమయంలోనే నా దగ్గర కొన్న ఇల్లును అమ్మేశారు. అయితే వారు కొనుక్కున్న ఇండిపెండెంట్​ హౌస్​ను రీ మోడలింగ్ చేసే వరకు పాత ఇంట్లోనే రెంట్​కి ఉన్నారు. అయితే ఈ లోపే సామ్​, చైతూ విడిపోయారు. తర్వాత సొంత ఇంటి కోసం సమంత బయట చాలా వెతికింది కానీ తనకి నచ్చలేదు. దీంతో నా దగ్గరికి వచ్చి వాళ్ళు అంతకముందు ఉన్న ఇల్లే కావాలని అడిగింది. నేను మీకు అమ్మాను, మీరు వేరేవారికి అమ్మారు కదా నేనేం చేయలేను అనడంతో.. ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి వారు కొన్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆ ఇంటినీ మళ్ళీ కొనుక్కుంది. ప్రస్తుతం సమంత అక్కడే తన తల్లితో కలిసి ఉంటుంది" అని తెలిపారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అభిమానులు.. సామ్​కు చైతూపై ఇంకా ప్రేమ తగ్గినట్లు లేదు అంటున్నారు.

ఇదీ చదవండి:'ఆ ఇద్దరిపై కేసులు పెడతా.. నా సినిమాను ఆపేందుకు ప్రయత్నించారు'

Last Updated : Jul 29, 2022, 11:23 AM IST

ABOUT THE AUTHOR

...view details