Salaar Third Day Collection Worldwide :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ సలార్- పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ కలెక్షన్లతో సత్తాచాటుతోంది. 2023లో అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్లు సాధించిన భారతీయ మూవీగా నిలిచింది. ఇప్పుడు సెకెండ్ డే కన్నా మూడో రోజు భారీ వసూళ్లను సాధించింది.
3రోజుల్లో రూ.400కోట్లు!
మూడు రోజులు కలిపి వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రూ.402 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక ఇంకో రోజులో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోమవారం క్రిస్మస్ హాలీడే, మంగళవారం హాఫ్ డే కనుక ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టే అవకాశముందని చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.176 కోట్లు, రెండో రోజు రూ.119 కోట్లు, మూడో రోజు రూ.107 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
నైజాంలో రూ.50కోట్లు!
నైజాంలో ఈ సినిమా మూడు రోజులు కలిపి రూ.44.80 కోట్లకుపైగా షేర్ సాధించినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆంధ్రలో కూడా భారీగానే వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. సలార్ చిత్రంలో ప్రభాస్ ఎలివేషన్లుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రభాస్ కటౌట్‍కు ఇది సరైన సినిమా అని ప్రశంసిస్తున్నారు.