తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

టాప్​-50 ఏషియన్​ సెలబ్రిటీల జాబితాలో.. తారక్, చరణ్​​ ఫస్ట్​ ప్లేస్..

యూకేలో ప్రతి సంవత్సరం విడుదల చేసే టాప్​-50 ఆసియన్​ సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్​ స్టార్స్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్ అగ్ర స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు. ఇంకా ఈ జాబితాలో ఎవరెవరు నిలిచారంటే..?

jr ntr and ram charan
తారక్ రామ్​చరణ్​​

By

Published : Dec 14, 2022, 11:19 PM IST

పాన్​ఇండియాగా సినిమాగా రిలీజైన 'ఆర్​ఆర్​ఆర్' ఇప్పడు అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటోంది. తాజాగా ఈ మూవీలో నటించిన అగ్ర హీరోలు ఎన్టీఆర్​, రామ్​చరణ్​ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. యూకేలో ప్రతి సంవత్సరం విడుదల చేసే టాప్​-50 ఏషియన్​ సెలబ్రిటీల జాబితాలో ఈ స్టార్​ హీరోలు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. ఈ 2022 జాబితా వచ్చే శుక్రవారం యూకే వీక్లీ మ్యాగజైన్‌ అయిన ఈస్టర్న్‌ ఐలో ప్రచురితమవుతుంది. ఓ ప్రాంతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించేలా చేసిన నటులుగా వీళ్లను కొనియాడింది.

"ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అద్భుతం సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులకు గతంలో ఎప్పుడూ చూడని ఇండియన్‌ కమర్షియల్ సినిమాలోని మజాను అందించారు" అని ఈ లిస్ట్‌ను తయారు చేసిన ఈస్టర్న్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎడిటర్‌ అస్జాద్​ నజీర్‌ అన్నారు. అందుకే ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ఆస్కార్స్‌లోని అన్ని కేటగిరీలకు నామినేట్‌ అవ్వడానికి ప్రయత్నిస్తోందని, ఇప్పటికే స్పాట్‌లైట్‌ అవార్డు అందుకోవడం సహా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు రెండు కేటగిరీల్లో నామినేట్‌ అయిందని ఆయన చెప్పారు.

2022లో సినిమా, సంగీతం, ఆర్ట్స్‌లో తమదైన ముద్ర వేసిన టాప్‌ 50 సౌత్‌ ఏషియన్‌ స్టార్లు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల తర్వాత పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ రెండోస్థానంలో నిలిచారు. ఇక మూడో స్థానంలో బ్రిటిష్ ఇండియన్‌ యాక్టర్‌ సిమోన్‌ యాష్లీ ఉండగా.. నాలుగో స్థానంలో బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌, ఐదో స్థానంలో పాకిస్థాన్‌ నటుడు ఇమాన్‌ వెల్లానీ నిలిచారు. వీరితో పాటు కేజీఎఫ్‌ హీరో యశ్‌ ఈ లిస్ట్‌లో ఆరోస్థానంలో నిలిచారు. ఇక ఏడోస్థానంలో ఉన్న శ్రేయా ఘోషల్‌.. సింగర్స్‌లో టాప్‌లో నిలిచారు. ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ పదో స్థానంలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details