కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ అవార్డుల పరంపర.. ఏకంగా ఐదు నామినేషన్లు..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' అవార్డుల పరంపర కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా 'క్రిటిక్ ఛాయిస్ అవార్డు'ల్లో ఐదు క్యాటగిరీల్లో నామినేషన్లు సాధించింది.
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం.. అవార్డుల పరంపర కొనసాగిస్తోంది. ఇటీవల సాటర్న్ అవార్డ్స్‌తో పాటు పలు అంతర్జాతీయ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. 'క్రిటిక్ ఛాయిస్ అవార్డ్స్'లో ఐదు క్యాటగిరీల్లో నామినేషన్లు సాధించింది. ఆ క్యాటగిరీలు.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ విదేశీ భాష చిత్రం, ఉత్తమ సాంగ్(నాటు నాటు.. పాట).
'క్రిటిక్ ఛాయిస్ అసోషియేషన్' అనేది.. అమెరికా, కెనడాలో సినీ మీడియా రంగంలో అతిపెద్ద అసోషియేషన్. దీనికి దాదాపు 600 మంది సినీ జర్నలిస్టులు, ఫిల్మ్ క్రిటిక్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సంవత్సరం సినీ విమర్శకులు ఏ సినిమా ఇష్టపడ్డారో అనేదానికి ఈ అవార్డు ఒక నిదర్శనం. దీంతో 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ఆశలు మరింత పెరిగిపోతున్నాయి.
'ఆర్ఆర్ఆర్' అంటే అంతే మరి...
ప్రముఖ సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ ఆర్ఆర్ఆర్ సినిమాకు కథను అందించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రెండు పవర్ఫుల్ క్యారక్టర్లు.. కొమురం భీం, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు అద్భుంతాగం చూపించారు. భారత్‌లో అఖండ విజయం సాధించింది ఈ సినిమా.. అంతర్జాతీయ స్థాయిలోనూ అదరగొట్టింది. అలియా భట్, అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ లాంటి నటులు ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమా.. అస్కార్ బరిలో ఉత్తమ విదేశీ చిత్రం క్యాటగిరీలో పోటీపడుతోంది. అయితే భారత్ నుంచి 'ఆర్ఆర్ఆర్'కు అస్కార్కు ఎంట్రీ లేకపోయినా.. ప్రవేటుగా పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా, శాటర్న్ అవార్డ్స్, న్యూయార్క్ క్రిటిక్ అవార్డ్స్, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్ సర్కిల్, బోస్టన్ సోసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్.. లాంటి అనేక అవార్డుల్లో నామినేషన్లు సాధించి అవార్డులు సొంతం చేసుకుంది.