తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రేమకావ్యం టైటానిక్ మళ్లీ వస్తోంది సరికొత్తగా - టైటానిక్​ సినిమా

Titanic movie వెండితెరపై ఆవిష్కరించిన అద్భతమైన ప్రేమకావ్యం టైటానిక్‌. ప్రపంచ సినీ చరిత్రలోనే గొప్ప సినిమాల్లో ఇదీ ఒకటి. చారిత్రక, రొమాంటిక్‌ అంశాల మేలుకలయిక అయిన ఈ చిత్రం ఈ ఏడాడి డిసెంబరుతో విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దర్శకుడు జేమ్స్​ కామెరూన్​.. టైటానికి ప్రియులకు ఓ సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఈ సినిమా రీమాస్టర్డ్​ వెర్షను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పుడంటే..

Remastered version of Titanic
టైటానిక్

By

Published : Jun 25, 2022, 7:50 PM IST

Updated : Oct 10, 2022, 3:49 PM IST

Titanic movie టైటానిక్​.. ఈ పేరు వింటే మనకు గుర్తొచ్చేది విషాద ఘటనే! మరోవైపు ప్రపంచమంతా మెచ్చుకున్న అద్భుతమైన వెండితెర ప్రేమకావ్యం. ఆ విషాద దుర్ఘటనకు ఓ అందమైన ప్రేమకథను జోడించి అందరీ హృదయాలను హత్తుకునేలా చేశారు దర్శకుడు జేమ్స్​ కామెరూన్​. 1997 డిసెంబరులో విడుదలైన ఈ మూవీ ప్రాంతీయ, భాషా భేదాలు లేకుండా అందరీ మనసుల్లో చెరగని ముద్ర వేసిందీ చిత్రం. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదమైన టైటానిక్ ప్రమాదానికి, ఇద్దరు ప్రేమికుల గాఢమైన ప్రేమను ముడిపెట్టి, మునుపెన్నడూ చూడని స్పెషల్ ఎఫెక్ట్స్​తో సినిమాను ఉద్విగ్నభరితంగా చూపించారు జేమ్స్​. ఈ చిత్రం సాంకేతికంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, సినిమాలోని సన్నివేశాలు, పాత్రలు వారి నటన కూడా ప్రేక్షకుల్ని టైటానిక్​ ప్రపంచంలో అంతే లీనమయ్యేలా చేసింది. అయితే ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబరుతో విడుదలై 25 వసంతాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా టైటానిక్​ ప్రియులకు ఓ సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు దర్శకుడు జేమ్స్​ కామెరూన్​. సినిమాను రీమాస్టర్డ్​ వెర్షన్​లో రిలీజ్​ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. రీమాస్టర్డ్​ అంటే.. 3డీ, 4కే హెచ్​డీఆర్​, హై ఫ్రేమ్​ రేట్​ ఫార్మాట్​లో మరింత క్వాలిటీగా దీన్ని విడుదల చేయడం. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నాలుగు రోజుల ముందుగానే ఫిబ్రవరి 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 2012లో 3డీ ఫార్మాట్​లో రిలీజ్​ చేశారు.

కథేంటంటే... టాటానిక్​ కథ ఇప్పటికీ ప్రతిఒక్కరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇందులో జాక్(లియోనార్డో)​ అనే పేదింటి కుర్రాడు ఉంటాడు. లాటరీలో రెండు టికెట్లు గెలుచుకుని టాటానిక్​ షిప్​లో థర్డ్​ క్లాస్​లో ప్రయాణం చేసే అవకాశం దక్కించుకుంటాడు. స్నేహితుడితో కలిసి ఎంతో హుషారుగా ఆ భారీ ఓడలోకి అడుగుపెట్టిన అతడికి.. అదే ఓడలో ప్రయాణం చేస్తున్న ఓ అందాల సుందరి రోజ్​(కేట్​ విన్స్​లెట్​) కంటపడుతుంది. ఇద్దరి మనసులు కలుస్తాయి. రోజ్​కి కాబోయే భర్త దీన్ని గ్రహించి జాక్​ను దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాడు. అతడి కళ్లుగప్పి జాక్​, రోజ్​ ప్రేమయాణం నడుపుతారు. ఈ ప్రేమకథ సినీప్రేమికులను ఎంతో ఆకట్టుకుంటుంది. కానీ విధి విచిత్రమైనది. ఆ ఓడ ప్రయాణ మధ్యలో బలమైన మంచు కొండను ఢీ కొట్టుకుని మునిగిపోతుంది. ఈ క్రమంలోనే వీలైనంతమంది కాపాడటానికి సిబ్బంది ప్రయత్నం చేయడం జరుగుతుంది. అయితే ఈ ప్రమాదంలో జాక్​ మునిగిపోగా.. రోజ్​ బ్రతికి ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ విషాదాంత ప్రేమకథ ప్రపంచం మొత్తం మీద బారీ వసూళ్లను సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. సుమారు 13వేల కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. 11 ఆస్కార్‌ అవార్డులను గెలుచుకుంది.

అసలు కథ​.. 1912లో సౌతంప్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్తుండగా.. నార్త్‌ అట్లాంటిక్‌ మహాసముద్రంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని మునిగిపోవడం, దాదాపు 1500 మంది జలసమాధి అయ్యారు. ఈ కథకే అద్భుతమైన ప్రేమకథను జోడించి సినిమాగా రూపొందించారు.

ఇదీ చూడండి: షారుక్​ @30ఇయర్స్​.. ఇంటెన్సివ్​ లుక్​లో​ బాద్​షా.. స్టైల్​ అదిరింది..

Last Updated : Oct 10, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details