విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ కథా చిత్రం 'లైగర్'. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం ఉదయం హైదరాబాద్, సాయంత్రం ముంబయిలో ఎంతో వేడుకగా జరిగింది. ముంబయిలో జరిగిన ఈవెంట్‌లో బీటౌన్ నటుడు రణ్‌వీర్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. అయితే.. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ చాలా సింపుల్ డ్రెస్సింగ్ స్టైల్, చెప్పులు వేసుకుని హాజరయ్యారు. ఈ విషయాన్ని గమనించిన రణ్‌వీర్ సింగ్ ఆయన స్టైల్‌ని మెచ్చుకుంటూ.. ''ఇలాంటి గ్రాండ్ ఈవెంట్‌కు విజయ్ చెప్పులు వేసుకుని వచ్చారు. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ చూస్తుంటే.. ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కి నేను వచ్చినట్లు లేదు. నా సినిమా ట్రైలర్ లాంచ్‌కి ఆయన హాజరైనట్లు ఉంది. ఏది ఏమైనా చెప్పులు వేసుకున్నప్పటికీ ఆయన స్టైల్ అదిరింది'' అని ప్రశంసించారు.
నత్తితో ఇబ్బందిపడ్డా..!
''ఈ సినిమాలో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. లుక్స్ పరంగా చూస్తే వందమందితో ఒకేసారి పోరాటం చేయగలిగేలా కనిపిస్తా. కానీ, తడబడకుండా 'ఐ లవ్ యూ' కూడా చెప్పలేను. ఎందుకంటే ఇందులో నా పాత్రకు నత్తి ఉంటుంది. నత్తిగా మాట్లాడటానికి మొదటి మూడు రోజులు చాలా కష్టపడ్డా. ఒక్కసారి మాట్లాడటం అలవాటయ్యాక ఫుల్ ఎంజాయ్ చేశా'' అని విజయ్ వివరించారు.