తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'రాక్షస రాజు'గా రానా - 'నా సామిరంగా'లో అంజిగాడిగా అల్లరి నరేశ్​ - రానా అప్​కమింగ్ మూవీస్

Rana Rakshasa Raja Movie : టాలీవుడ్ స్టార్ హీరో రానా బర్త్​డే స్పెషల్​గా ఓ స్పెషల్ పోస్టర్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అందులో రానా ఓ కొత్త లుక్​లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? దాని గురించి మరిన్ని విశేషాలు మీ కోసం

Rana Rakshasa Raja Movie
Rana Rakshasa Raja Movie

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 12:38 PM IST

Updated : Dec 14, 2023, 12:54 PM IST

Rana Rakshasa Raja Movie :ఓ విలక్షణ నటుడిగా, సూపర్ విలన్​గా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు టాలీవుడ్​ స్టార్​ హీరో రానా. లీడర్​ సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన రానా ఆ తర్వాత వరుస సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నారు. 'కృషం వందే జగద్గురుం', 'నేను నా రాక్షసి', 'నేనే రాజు నేనే మంత్రి', 'బాహుబలి', 'ఘాజీ', 'విరాట పర్వం' లాంటి సినిమాల్లో తనదైన శైలిలో నటించిన ఈయనకు 'బాహుబలి' బిగ్​ బ్రేక్ ఇచ్చింది. ఇందులో ఆయన విలన్ క్యారెక్టర్​ చేసినప్పటికీ తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇక సినిమాల్లో నటిస్తూనే రానా వెబ్​ సిరీస్​ లోకంలోకి అడుగుపెట్టారు. తన బాబాయ్​ వెంకటేశ్​తో కలిసి 'రానా నాయుడు' అనే వెబ్​ సిరీస్​లో మెరిశారు. ఈ సీరిస్​ ప్రేక్షకుల నుంచి విమర్శలు అందుకున్నప్పటికీ అత్యథిక వ్యూవ్స్​తో టాప్ పొజిషన్​లో ఉంది. అయితే వీటి తర్వాత రానా తాజాగా ఇప్పుడు 'హిరణ్య కశ్యప' అనే సినిమాకు సైన్​ చేశారు. అంతే కాకుండా ఈ సినిమాతో పాటు తలైవర్​ 170గా తెరకెక్కుతున్న వెట్టయన్​ సినిమాలోనూ రానా కీ రోల్​ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ మధ్యలోనే రానా మరో స్టార్ డైరెక్టర్ మూవీకి సైన్​ చేశారు. ఆయనెవరో కాదు రానాకు 'నేనే రాజు నేనే మంత్రి' లాంటి సూపర్​ హిట్ మూవీని అందించిన తేజ. వీరిద్దరి కాంబోలో ఇప్పుడు 'రాక్షస రాజా' అనే సినిమా తెరకెక్కనుంది. నేడు రానా బర్త్​డే ఈ సందర్భంగా మూవీ మేకర్స్​ దీనికి సంబంధించిన సాలిడ్ పోస్టర్​ రివీల్​ చేశారు. అందులో రానా ఓ పెద్ద గన్​ పట్టుకుని సీరియస్ లుక్​లో కనిపించారు. దీన్ని చూసిన అభిమానులు మూవీ టీమ్​కు ఆల్​ ద బెస్ట్​ చెప్తున్నారు.

అంజిగాడి పాత్రలో అల్లరి నరేశ్ - వింటేజ్ వైబ్​ వచ్చేసిందిగా!​
Allari Naresh Na Saami Ranga Movie :మరోవైపు టాలీవుడ్​లో స్టార్ హీరో అల్లరి నరేశ్​ ఎప్పటిలాగే ప్రేక్షకులను అలరించేందుకు మందుకొస్తున్నారు. అక్కినేని నాగార్జున లీడ్​ రోల్​లో వస్తున్న 'నా సామి రంగ' సినిమాలో అంజి అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్​ తాజాగా ఓ పోస్టర్​ రివీల్​ చేసి వెల్లడించింది. అందులో నరేశ్​ సింపుల్​ లుక్​లో కనిపించి ఆకట్టుకున్నారు. దీన్ని చూసిన అభిమానులు వింటేజ్​ అల్లరి నరేశ్​ను చూసిన ఫీలింగ్ కలుగుతోందని అంటున్నారు.

అమెరికాకు రానా వెళ్లింది అందుకేనా?.. రెండు పెద్ద సర్​ప్రైజ్​లే!

Thalaivar 170 Cast : మూవీ లవర్స్​కు డబుల్​ ట్రీట్​.. సూపర్ స్టార్​ సినిమాలోకి ఆ ఇద్దరి ఎంట్రీ..

Last Updated : Dec 14, 2023, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details