తన సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం స్టార్ డైరెక్టర్ శంకర్ భారీగానే ఖర్చు చేస్తారన్న సంగతి తెలిసిందే. భారీ హంగులతో కోట్లు వెచ్చించి మరీ షూట్ చేస్తారు. ఆయన గత చిత్రాలు చూస్తే పాటలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే ఇప్పుడాయన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కలిసి సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. . అయితే, ఈ సినిమాలోనూ అద్భుతం అనిపించేలా శంకర్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఆ మధ్య కాలంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని.. 7 నిమిషాల నిడివి ఉండే సన్నివేశం కోసం ఏకంగా రూ.70 కోట్లు ఖర్చుచేస్తున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒక పాట కోసం ఏకంగా రూ.25 కోట్లు, మరో రెండు సాంగ్స్ కోసం రూ.8కోట్లు, రూ.15కోట్లు కేటాయించారని ప్రచారం సాగింది. రీసెంట్గా కూడా మరో పాటను రూ.15కోట్లు పెట్టి తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మరి ఆ పాట కోసమే లేదా మరో సాంగ్ కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్ర్లను రంగంలోకి దింపారట. వారందరితో కలిసి పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ సినిమాపై రోజు రోజుకు అంచనాలు మాత్రం భారీగా పెరిగిపోతున్నాయి.