తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Ramcharan Buchi Babu Movie : చరణ్​ ఫ్యాన్స్​ గుడ్​ న్యూస్​.. 'ఆర్​సీ 16' కూడా ఆ నయా ట్రెండ్​ బాటలోనే.. - రెండు భాగాలుగా రామ్ చరణ్ బుచ్చిబాబు మూవీ

Ramcharan Buchi Babu Movie : రామ్ చరణ్​ - బుచ్చి బాబు సినిమా కూడా.. ప్రస్తుతం చిత్రసీమలో నడుస్తున్న ఓ కొత్త ట్రెండ్​లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు..

Ramcharan Buchi Babu Movie : చరణ్​ ఫ్యాన్స్​ గుడ్​ న్యూస్​..  'ఆర్​సీ 16' కూడా ఆ నయా ట్రెండ్​ బాటలోనే..
Ramcharan Buchi Babu Movie : చరణ్​ ఫ్యాన్స్​ గుడ్​ న్యూస్​.. 'ఆర్​సీ 16' కూడా ఆ నయా ట్రెండ్​ బాటలోనే..

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 9:25 PM IST

Ramcharan Buchi Babu Movie : 'ఉప్పెన' ఫేమ్​ డైరెక్టర్​ బుచ్చిబాబు - మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ కాంబోలో 'ఆర్సీ 16'(వర్కింగ్ టైటిల్​) సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎప్పుడో ప్రకటించినప్పటికీ... ఇంకా సెట్స్​పైకి కూడా వెళ్లలేదు. ఈ సినిమా ఎప్పడెప్పుడు సెట్స్​పైకి వెళ్తుందా, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభించుకుంటుందా అని ఫ్యాన్స్​ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ స్కిప్ట్​ వర్క్​ ఆలస్యం కావడం సహా రామ్ చరణ్ 'గేమ్​ ఛేంజర్'​ చిత్రంతో కాస్త బిజీగా ఉండటం వల్ల.. చిత్రీకరణ ప్రారంభం కాలేదు. అయితే ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రస్తుతం చిత్రసీమలో నడుస్తున్న ఓ కొత్త ట్రెండ్​లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది.

అదేంటంటే?.. బాహుబలి, కేజీయఫ్​ సిరీస్‌ చిత్రాలతో రెండు భాగాల ట్రెండ్‌ మొదలైన సంగతి తెలిసిందే. నిర్ణీత నిడివిలో చెప్పలేమనుకున్న ఇంట్రెస్టింగ్​ స్టోరీస్​ను... భాగాలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మన దర్శకనిర్మాతలు. ఇది కమర్షియల్​గానూ మంచి లాభదాయకంగా ఉండటం వల్ల.. ఈ ట్రెండ్​కు మంచి ఆదరణ దక్కుతోంది. తొలి పార్ట్ క్లైమాక్స్​లో సస్పెన్స్​ పెట్టి.. దాని రెండో భాగంలో రివీల్​ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

ఇటీవలే ఎన్టీఆర్​ దేవర చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా అనౌన్స్ చేసి అభిమానుల్లో జోష్ నింపారు. ఇప్పుడు ఆర్​సీ 16 కూడా ఇదే ఫార్మూలాను ఫాలో కానుందని తెలిసింది. ఈ మధ్యే ఈ సినిమా కథ పూర్తైందని తెలిసింది. అయితే ఈ కథ చాలా పెద్దగా ఉందని, అందుకే దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనలో బుచ్చిబాబు ఉన్నట్లు ప్రచారం మొదలైంది.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే మెగా అభిమానులకు పండగనే చెప్పాలి. ఇకపోతే ఈ మూవీ రెగ్యులర్​ షూటింగ్​ ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభిస్తారని ఆ మధ్య బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. సినిమా రా అండ్‌ రస్టిక్‌గా ఉంటుందని, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మూవీ స్పోర్ట్స్​ బ్యాక్​డ్రాప్​లో ఉంటుందని అందరు అనుకుంటున్నారని, కానీ ఇది వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుందని అన్నారు.

RC 16 Heroine : రామ్‌చరణ్‌కు జోడీగా ఆ స్టార్‌ హీరోయిన్‌ కూతురు!.. భలే క్యూట్​గా ఉందిగా.. మీరు చూశారా?

2024 Pan India Movies : టాలీవుడ్​ నుంచి ఆ 5 సినిమాలు ఒకే.. కానీ ఇవి మాత్రం కాస్త డౌటే!

ABOUT THE AUTHOR

...view details