తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చెర్రీ-శంకర్ మూవీ క్రేజీ అప్డేట్.. 'సీతారామం'గా దుల్కర్​ - charlie movie

Ram Charan Shankar movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో శంకర్ దర్శకత్వంలో రామ్​చరణ్ నటిస్తున్న చిత్రం, దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా సహా పలు చిత్రాల విశేషాలు ఉన్నాయి.

Ram Charan
dulquer salmaan new movie

By

Published : Apr 10, 2022, 5:22 PM IST

Ram Charan Shankar movie: శంకర్ దర్శకత్వంలో రామ్​చరణ్ నటిస్తున్న సినిమాకు (ఆర్​సీ15) సంబంధించి ఓ అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో చరణ్​ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఒక పాత్రలో అధికారిగా, మరో పాత్రలో విద్యార్థిగా నటించనున్నారట చెర్రీ. కియారా అడ్వాణీ నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్​రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

కియారా

'సీతారామం'గా దుల్కర్:మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, రష్మిక మందాన, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడి దర్శకత్వం వహించిన చిత్రానికి పేరు ఖరారైంది. శ్రీరామ నవమి సందర్భంగా తమ చిత్రానికి 'సీతారామం' పేరును ఖరారు చేసినట్లు స్వప్న సినిమాస్ వెల్లడించింది. యుద్ధంతో రాసిన ప్రేమ కథ శీర్షికతో ఆసక్తికరంగా 'సీతారామం టీజర్'ను చిత్ర బృందం విడుదల చేసింది.

ముస్లిం యువతి 'అఫ్రీన్'గా రష్మిక నటించగా.. సైనికుడి పాత్రలో దుల్కర్ నటించాడు. వైజయంతి మూవీస్ సమర్పణలో ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

మృనాల్

జాన్వీ కొత్తం చిత్రం షురూ: 'దంగల్' తెరకెక్కించిన నితేశ్ తివారీ దర్శకత్వంలో వరుణ్ ధావన్, జాన్వీ కపూర్​ నటిస్తున్న కొత్త చిత్రం 'బవాల్'. ఈ సినిమా చిత్రీకరణ ఆదివారం లఖ్​నవూలో ప్రారంభమైంది. సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్​ కానుంది.

జాన్వీ
.
జూన్ 10న కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన 'చార్లీ' విడుదల

ఇదీ చూడండి:'శ్రీరామ నవమి' స్పెషల్​.. తారల శుభాకాంక్షలు.. కొత్త పోస్టర్ల సందడి

ABOUT THE AUTHOR

...view details