తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రాజమౌళి, మహేశ్​ సినిమా లేటెస్ట్​ అప్డేట్​ - స్విచ్ ఆఫ్ అంటున్న కీరవాణి! - నా సామి రంగ సంక్రాంతి

Rajamouli Mahesh Babu Movie : 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో ఆస్కార్‌ అందుకుని తెలుగు సినిమా గొప్పతనాన్ని, భారతీయ చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు సంగీత దర్శకుడు కీరవాణి. అయన తాజాగా దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్​ మహేశ్ బాబు కలిసి చేయబోతున్న సినిమా గురించి మాట్లాడారు.

Rajamouli Mahesh Babu Movie
రాజమౌళి, మహేశ్​ సినిమా అప్డేట్​ - స్విచ్ ఆఫ్ అంటున్న కీరవాణి!

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 6:45 AM IST

Rajamouli Mahesh Babu Movie : 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్​ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుంది అన్నది స్పష్టత లేదు. దీనిపై మూవీటీమ్​ మౌనం పాటిస్తోంది. అయితే రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడు అయిన కీరవాణి ఈ విషయంపై మాట్లాడారు.

తన కొత్త చిత్రం 'నా సామి రంగ' ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయనకు రాజమౌళి - మహేశ్ సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి ఆయన తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నారు. ఈ సినిమా గురించి అడిగేందుకు రాజమౌళికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోందని చమత్కరించారు. "మహేశ్​ సినిమా గురించి తెలుసుకోవాలంటే రాజమౌళికి ఫోన్‌ చేసి అడగాలి. కానీ తనకు ఫోన్‌ చేస్తే అది స్విచ్చాఫ్‌లో ఉంటోంది. అంటే ఇంకా పని నా వరకు రాలేదని అర్థం." అని చెప్పుకొచ్చారు.

Pawan Kalyan Hari Hara Veera Mallu : ఇక తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. మెగాస్టార్​ చిరంజీవితో చేస్తున్న సినిమా నడుస్తోందని.. పవన్ సినిమాకు సంబంధించి మూడు సాంగ్స్​ పూర్తయ్యాక బ్రేక్ వచ్చిందని, మళ్లీ దర్శకుడు క్రిష్ అడిగినప్పుడు ఈ సినిమా పని మొదలు పెడతానని చెప్పారు. "‘హరి హర వీరమల్లు చిత్ర విషయానికొస్తే ప్రస్తుతానికి మూడు పాటలు రికార్డు చేశాం. చిరంజీవి సినిమా ఈ మధ్యే షూటింగ్ మొదలైంది. దానికి సంబంధించిన మ్యూజిక్​ వర్క్ మొదలైంది" అని అన్నారు.

నాగార్జున 'నా సామి రంగ' చిత్రానికి సంబంధించి మ్యూజిక్​ ఔట్​పుట్​ విషయంలో తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు కీరవాణి. తాను గతంలో నాగార్జునతో కలిసి చేసిన ప్రెసిడెంట్ గారి పెళ్ళాం ఎలాంటి విజయాన్ని అందుకుందో ఇదీ అలాంటి ఫలితాన్నే అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

'గుంటూరు కారం' ట్రైలర్​ క్రేజ్​- 24 గంటల్లో 39 మిలియన్ వ్యూస్- సలార్ రికార్డ్ బ్రేక్

'90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'కు విశేష స్పందన- 'ETV WIN​'లో రికార్డ్స్ బ్రేక్!

ABOUT THE AUTHOR

...view details