Purijagannadh in Godfather movie: సినీప్రియుల ఊహాగానాలు నిజమయ్యాయి. అనుకున్నట్టే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ నటించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిరు. " నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేశాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా.. అందుకే గాడ్‌ఫాదర్ మూవీలో స్పెషల్ రోల్ చేస్తున్న పూరి జగన్నాథ్‌ను పరిచయం చేస్తున్నా." అని ట్వీట్ చేశారు చిరు. మలయాళ హిట్ 'లూసిఫర్'కు రీమేక్‌గా 'గాడ్‌ఫాదర్'గా రూపొందుతోంది. మాతృకలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రను తెలుగులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ చేస్తుండటం విశేషం. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్. సత్యదేవ్, సునీల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
'గాడ్‌ఫాదర్'లో పూరి.. కన్ఫామ్ చేసిన చిరు - గాడ్‌ఫాదర్‌లో చిరు
Purijagannadh in Godfather movie: తన సినిమాలో దర్శకుడు పూరి జగన్నాథ్ నటించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్ చిరింజీవి. 'గాడ్‌ఫాదర్' సినిమాలో పూరి నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు చిరు.
చిరు పూరి