పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు అంటూ ఫ్రొఫెషనల్ లైఫ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు పార్టీకి సంబంధించిన మీటింగ్స్, మరోవైపు మూవీ షూటింగ్స్.. అంటూ ప్రజలు, అభిమానుల కోసమే శ్రమిస్తున్నారు. కెరీర్లో అసలు ఖాళీ లేకుండా గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో 'OG' ఒకటి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ షూటింగ్ లాంఛ్ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్గా రెండు రోజుల క్రితం ఈ మూవీ టెస్ట్ షూట్లో బిజీగా ఉందని సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను కూడా షేర్ చేశారు. అప్పుడా పిక్స్ నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అయ్యాయి.
అయితే సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే ఆసక్తి ఇన్ని రోజులు అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఇప్పుడా ప్రశ్నకు సమాధానం దొరికేసింది! నేచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందం ప్రియాంక అరుళ్ మోహన్. ఈ ముద్దుగుమ్మనే 'ఓజీ'లో హీరోయిన్గా తీసుకున్నారని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ముంబయిలో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుందని అంటున్నారు. అప్పుడే సెట్స్‌లోకి ఆమె అడుగుపెట్టనున్నట్లు సమాచారం అందింది. ఇకపోతే ప్రియాంక మోహనన్.. శర్వానంద్‌తో కలిసి 'శ్రీకారం' సినిమాలోనూ నటించి తన యాక్టింగ్, అందంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తమిళంలోనూ హిట్ చిత్రాలు 'ఈటీ', 'డాన్' వంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ధనుశ్‌తో 'కెప్టెన్ మిల్లర్'లో నటిస్తోంది.