తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సోషల్​మీడియా అంతా 'ఆదిపురుష్' మయం.. అభిమానుల సందడే సందడి! - ఆదిపురుష్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్ అతిథులు

Adipurush Pre Release Event : పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మైథలాజికల్​ మూవీ ఆదిపురుష్​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ అట్టహాసంగా జరగనుంది. జూన్​ 6న జరిగే ఈ వేడుకను గ్రాండ్​గా నిర్వాహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే సోషల్​మీడియాలో ఒక్కరోజు ముందే ఈ ఈవెంట్​ సంబరాలు ప్రారంభమైపోయాయి. ప్రభాస్​ అభిమానులు అంతా సోషల్​ మీడియాను సినిమా పోస్టర్లతో నింపేశారు. ఆ విశేషాలు మీ కోసం..

adipurush pre release event
adipurush pre release event

By

Published : Jun 5, 2023, 1:34 PM IST

Adipurush Pre Release Event : ప్రభాస్​ 'ఆదిపురుష్' సినిమా మరో పది రోజుల్లో వరల్డ్​ వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్​ కాబోతుంది. దీంతో​ తిరుపతిలోని ఎస్వీయూ గ్రౌండ్స్​ వేదికగా 'ఆదిపురుష్'​ ప్రీ రిలీజ్​ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించనుంది మూవీటీమ్​. అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదికను సైతం మునుపెన్నడు లేని విధంగా భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు. స్టేజ్ ప్రిపరేషన్​ నుంచి ఆర్టిస్టుల పెర్​ఫార్మెన్స్​​ వరకు అన్నింటిని అన్ని గ్రాండ్​గా ఉండేలా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు సినీ లవర్స్​ ఈ ఈవెంట్​ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరో స్టేజ్​పై మాట్లాడుతుంటే చూడాలని, ఆయన మాట వినాలని ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ సంబరాలు ఒక్క రోజు ముందే ప్రారంభమైపోయాయి. అభిమానులు, నెటిజన్లంతా.. సోషల్​ మీడియాలో ఈ ఈవెంట్​కు సంబంధించిన వివరాలను, సినిమా పోస్టర్లను పోస్ట్​ చేస్తూ విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ రోజు ఎప్పుడు ముగుస్తుందా.. ఈవెంట్​ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చీఫ్​ గెస్ట్​గా చిన్నజీయర్​ స్వామి..

Adipurush Event Tirupati : ఈ వేడుకకు అతిథిగా ఎవరు వస్తారంటూ చిత్రబృందం రెండు రోజుల నుంచి అభిమానుల్లో ఆసక్తి పెంచుతూ పోస్టర్లు విడుదల చేసింది. తాజాగా ఆ అతిథి ఎవరో చెబుతూ ట్వీట్‌ కూడా చేసింది. స్పెషల్​ గెస్ట్​గా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి​ రాబోతున్నట్లు తెలిపింది. ఇకపోతే ఈయనతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని తెలిసింది​. రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడంతో.. ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించనున్నట్లు సమాచారం. అందుకే చినజీయర్‌ స్వామిని ఆహ్వానించారట. ఇక ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్‌, 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారని తెలిసింది.

బైక్​పై ముంబయి టు తిరుపతి.. ఈ చిత్రానికి మ్యూజిక్​ అందించిన దిగ్గజ ద్వయం అజయ్​-అతుల్​లో ఒకరైన అతుల్​ గోగావలే..ఆదిపురుష్​ సినిమాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. బైక్‌పై ముంబయి నుంచి తిరుపతికి ఆయన ప్రయాణించారు. జూన్ 3న రాత్రి ముంబయిలో బయలుదేరి జూన్ 5న తిరుపతికి చేరుకున్నారు. ఇక ఆయన్ను ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు తిరుపతి ప్రజలు సాదరంగా స్వాగతించారు. ఇక తిరుపతి చేరుకున్న తర్వాత తన సోదరుడు అజయ్​తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద జైశ్రీరామ్ పాటను సమర్పించనున్నారు.

సోషల్​మీడియాలో ఫుల్ ట్రెండ్​.. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఆదిపురుష్​ ప్రీరిలీజ్​ ఈవెంట్ అనే హ్యాష్​ట్యాగ్​ఫుల్​ ట్రెండ్​ అవుతోంది. ఈవెంట్​ జరగనున్న ప్రదేశానికి ఒకరోజు ముందుగానే అభిమానులు చేరుకుని.. అక్కడి ఫొటోలు, వీడియోలు తీసుకుని పోస్ట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో సోషల్‌ మీడియా అంతా 'ఆదిపురుష్‌' పోస్టర్లు, ప్రీ రిలీజ్​ ఈవెంట్ల ఏర్పాట్లకు సంబంధించిన ఫొటోలతో నిండిపోయింది. ఇకపోతే ఈవెంట్​లో ప్రభాస్​ ఏం మాట్లాడతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు మూవీ టీమ్​ కూడా కౌంట్​డౌన్​తో రోజుకో పోస్టర్​ రిలీజ్​ చేస్తూ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.

ABOUT THE AUTHOR

...view details