తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2022, 12:49 PM IST

ETV Bharat / entertainment

ప్రభాస్ ఫ్యాన్స్​కు మళ్లీ షాక్​.. ఆ సినిమా కూడా వాయిదా!

ప్రభాస్​ అభిమానులకు షాక్ మీద్​ షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్​ రిలీజ్​ వాయిదా పడగా ఇప్పుడు ఆయన నటిస్తున్న మరో చిత్రం కూడా పడింది.

Prabhas Salaar postpone
ప్రభాస్ సలార్​ పోస్ట్​ పోన్​

పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్‌ నటిస్తున్న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. వాటిలో ఆదిపురుష్‌, సలార్ కూడా ఉన్నాయి‌. తాజాగా ఆదిపురుష్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లు దర్శకుడు ఓంరౌత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ కొందరిని నిరాశ పరచడంతో చిత్రబృందం ఈ చిత్రాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడం కోసం మరికొంత సమయం తీసుకోనుంది. ఆ కారణంతోనే ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాది జూన్‌కు వాయిదా వేశారు.

అయితే ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మరో వార్త కలవరపెడుతోంది. సలార్‌ చిత్రం కూడా వాయిదా పడనుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.. కానీ దాదాపు వాయిదా పడినట్లే సమాచారం.

ఇక సలార్‌ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేస్తామని చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే తాజాగా ఆదిపురుష్‌ వాయిదా పడడంతో దాని ప్రభావం సలార్‌ సినిమా పై పడనుందని.. అందుకే ఈ సినిమాను కూడా వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని టాక్‌. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్‌వి కావడంతో విడుదల ఆలస్యం అయినా.. అభిమానుల అంచనాలకు తగ్గట్లు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఇదీ చూడండి:సుధీర్​తో ప్రేమ, పెళ్లి.. రష్మి ఏం చెప్పిందంటే?

ABOUT THE AUTHOR

...view details