తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్​-ప్రశాంత్​ నీల్​ కాంబోలో మరో మూవీ​.. నిజమేనా? - prabhas prasanth neel movie updates

'సలార్' మూవీతో ఇప్పటికే బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్​.... ప్రభాస్​తో కలిసి మరో సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఆ సంగతులు..

prabhas and prashanth neel upcoming movie
ప్రశాంత్ నీల్​, ప్రభాస్

By

Published : Jan 17, 2023, 2:51 PM IST

Updated : Jan 17, 2023, 5:10 PM IST

'కేజీయఫ్​' సిరీస్​తో యావత్​ దేశాన్ని కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన దర్శకుడు ప్రశాంత్​ నీల్​ ప్రస్తుతం వరుస సినిమాలను ప్రకటించి బిజీగా గడుపుతున్నారు. అలా తన సినిమాలతో కొత్త ట్రెండ్​ను సృష్టించిన నీల్.. ప్రస్తుతం​ ప్రభాస్​తో 'సలార్' చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు​ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఇంకాస్త మెరుగులు దిద్దే పనిలో నిమగ్నమైపోయారు​. దీని తర్వాత ఎన్టీఆర్​తో ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నారు. అయితే ఇవి ఇలా ఉండగనే ప్రశాంత్​ కొత్త ప్రాజెక్ట్​ గురించి ఓ క్రేజీ అప్డేట్​ ఇచ్చారు ప్రముఖ నిర్మాత దిల్​ రాజు.

ఇటీవలే 'వారుసుడు' సక్సెస్​ను ఆస్వాదిస్తున్న దిల్​ రాజు.. తన ప్రొడక్షన్​ హౌస్​ నుంచి మూడు చిత్రాలు రాబోతున్నట్లు తెలిపారు. అందులో మోహనకృష్ణ ఇంద్రగంటితో 'జటాయు', శైలేష్ కొలనుతో 'విశ్వంభర', ప్రశాంత్ నీల్​తో 'రవణం' మూవీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఇది ప్రకటించిన కాసేపటికే నెట్టింట్లో ఓ కొత్త ప్రచారం అందుకుంది. రవణం చిత్రాన్ని ప్రశాంత్​..ప్రభాస్​తోనే చేయనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. భారీ వీఎఫ్​ఎక్స్​తో పీరియాడికల్​ డ్రామాగా రూపొందనుందని అంటున్నారు. ఒకవేళ ఇది కనుక నిజం అయితే ప్రభాస్ ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.

Last Updated : Jan 17, 2023, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details