ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- హీరోయిన్ పూజా హెగ్డే నటించిన సినిమా 'అల వైకుంఠపురములో'. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాలోని డైలాగులు, పాటలు సైతం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా 'బుట్టబొమ్మ' పాట అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఎక్కడ చూసిన ఈ పాటే కనిపించేది, వినిపించేది. అయితే ఈ మూవీ విడుదలై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా పూజా హెగ్డే ట్విటర్‌లో స్పందించారు.
బుట్టబొమ్మ పాట క్లిపింగ్‌తో ఉన్న వీడియో పోస్ట్ చేసిన పూజా "అమూల్య పాత్రకు మూడేళ్లవుతోంది. 'అల వైకుంఠపురములో' సినిమా నాకెప్పుడు ప్రత్యేకమైనదే. నా హృదయంలో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది" అని తెలిపింది. ఈ వీడిమో చూసిన నెటిజన్లు మరొకసారి మీ జోడిని స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా బాలీవుడ్‌లోనూ తన హవా చాటుతోంది. తాజాగా ఈ అమ్మడు 'సర్కస్' సినిమాలో మెరిసింది. అలాగే బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్'లో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది.