ఓవైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం టాలీవుడ్లో ప్రభాస్ తర్వాత ఈ హీరో లైన్లో పెట్టలేనన్ని సినిమాలను వరుసగా లైనప్‌లో పెట్టారు. అయితే వీటిని ప్రకటించారేగాని సెట్స్‌పైకి తీసుకెళ్లలేదు. దీంతో అభిమానులు షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు, థియేటర్లలోకి ఎప్పుడూ తీసుకొస్తారు అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన.. తన అభిమానుల్లో జోష్ నింపేలా... కొత్త సినిమాలను వరుసగా ఒక్కొక్కటిగా సెక్స్ పైకి తీసుకెళ్లడం ప్రారంభించారు.
అలా గతేడాది డిసెంబర్లో హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్‌ను ప్రారంభించగా.. ఇక ఈ ఏడాది జనవరిలో దర్శకుడు సుజిత్‌తో చేయనున్న భారీ యాక్షన్ ప్రాజెక్టు OGని మొదలు పెట్టేశారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన చేయబోతున్న తమిళ చిత్రం వినోదయ సీతమ్ తెలుగు రీమేక్‌ను సెక్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదిగో షూటింగ్ ప్రారంభం.. ఇదిగో షూటింగ్ మొదలు అంటూ.. ఊరిస్తూ వస్తున్న ఈ చిత్రం కూడా ఎట్టకేలకు చిత్రీకరణ ప్రారంభించుకోనుందట. వాలెంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న పూజా కార్యక్రమాలతో ఈ మూవీని కూడా గ్రాండ్‌గా ప్రారంభిస్తారని తెలిసింది. అలా ఒక్కో నెలలో ఒక్కో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు పవన్.