తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరోసారి నిర్మాతగా పవర్​ స్టార్​.. రూమర్స్​కు హీరో సూర్య చెక్

'భ‌ర‌త్ అనే నేను', 'భీమ్లానాయ‌క్' చిత్రాల‌తో కెమెరామెన్​గా ప్ర‌తిభ‌ చాటుకున్న ర‌వి.కె.చంద్ర‌న్‌.. 'త‌మ‌రా' పేరుతో ఓ ఇంట‌ర్నేషనల్​ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి హీరో ప‌వ‌న్‌క‌ల్యాణ్​, త్రివిక్రమ్​ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. మరోవైపు.. హీరో సూర్యతో దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న సినిమా ఆగిపోయినట్టు ఊహాగానాలు వచ్చాయి. వాటికి సూర్య చెక్​ పెట్టారు.

Suriya MOVIE NEWS
Suriya MOVIE NEWS

By

Published : May 26, 2022, 4:37 PM IST

PavanKalyan As Producer: త‌మిళ చిత్రసీమలో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన ర‌వి.కె.చంద్ర‌న్‌... మహేశ్​బాబు 'భ‌ర‌త్ అనే నేను' సినిమాతో కెమెరామెన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ స‌క్సెస్ త‌ర్వాత ప‌వ‌న్‌ క‌ల్యాణ్​ 'భీమ్లానాయ‌క్' సినిమాకు ఛాయాగ్రాహకుడిగా ప‌నిచేశారు. రవి.కె.చంద్రన్ విజువ‌ల్ స్టోరీ టెల్లింగ్ అద్భుత‌మంటూ సినిమా ప్ర‌మోష‌న్స్​లో ఆయనపై ప‌వ‌న్‌ ప్ర‌శంస‌లు కూడా కురిపించారు.

తాజాగా ర‌వి.కె.చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ 'త‌మ‌రా'కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. తొలుత ఈ సినిమాను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే తాజాగా ఈ మూవీ నిర్మాణంలో ప‌వ‌న్‌తో పాటు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కూడా భాగ‌మైన‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించారు. వ‌సంత్ సెల్వ‌న్ అనే ర‌చ‌యిత రాసిన 'దీప‌న్' అనే నాట‌కం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. త‌న మూలాల‌ను అన్వేషిస్తూ పుదుచ్చేరి వ‌చ్చిన ఓ యువ‌తికి ఎదురైన అనుభవాలతో ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ సినిమా రూపొందిద్దుకుంటున్న‌ట్లు స‌మాచారం.

Suriya 41 Movie Update: సూర్య కథానాయకుడిగా దర్శకుడు బాల ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు మూడు రోజులుగా సినీవర్గాల్లో ఈ సినిమాపై ఊహగానాలు వినిపిస్తున్నాయి. సినిమా ఆగిపోయిందని.. హీరో, దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. సినిమా పక్కన పెట్టేశారని అని కూడా కొందరు అన్నారు. వాటికి హీరో సూర్య ఫుల్ స్టాప్ పెట్టారు.

దర్శకుడు బాలాతో ఏదో డిస్కస్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''మళ్లీ సెట్స్​లోకి రావడానికి వెయిట్ చేస్తున్నాను. #Suriya41'' అని ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దాంతో ఊహగానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇప్పటికే కన్యాకుమారిలో ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్​ను పూర్తి చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్​ నిర్మిస్తోంది.

ఇవీ చదవండి:NBK107: ఫ్యాన్స్​కు పూనకాలే.. బాలయ్య కొత్త సినిమా టైటిల్​ ఫిక్స్!

'రామారావు ఆన్‌ డ్యూటీ' రిలీజ్​ వాయిదా.. 'పక్కా కమర్షియల్‌' అప్డేట్​

ABOUT THE AUTHOR

...view details