తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నాని 'దసరా'పై ప్రభాస్ వైరల్​ కామెంట్స్​.. ఏమన్నారంటే? - నాని దసరాపై ప్రభాస్ కామెంట్స్​

నేచురల్ స్టార్ నటించిన 'దసరా' సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు స్పందిస్తున్నారు. చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​.. ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఏమన్నారంటే..

Prabhas Comments on Natural star Nani Dasara movie
నాని 'దసరా'పై ప్రభాస్ వైరల్​ కామెంట్స్​.. ఏమన్నారంటే?

By

Published : Apr 3, 2023, 6:32 AM IST

Updated : Apr 3, 2023, 7:32 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ రిలీజ్ చిత్రం 'దసరా'. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. రూ.100కోట్ల దిశగా ముందుకెళ్తోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్​లో రూపొందిన ఈ చిత్రంలో తొలిసారి నాని ఊర మాస్ అవతారంలో ప్రేక్షకుల్ని అలరించారు. దీంతో ఈ చిత్రంపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. కథతో పాటు నాని, కీర్తిసురేశ్ నటన అదిరిపోయిందని అంటున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేశ్​ బాబు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మూవీ అద్భుతంగా ఉందని.. ఈ చిత్రం విషయంలో తాను ఎంతగానో గర్విస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్.. దసరా చిత్రంపై కామెంట్స్ చేశారు. సినిమా అద్భుతంగా ఉందని కొనియాడారు. దీంతో నాని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"ఇప్పుడే దసరా చిత్రం చూశాను. ఏం సినిమా అది. అద్భుతం. నాకు బాగా నచ్చేసింది. నాని ఇలాంటి చిత్రం చేసినందుకు కంగ్రాట్స్. నాని, కీర్తి సురేశ్​, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మూవీటీమ్​.. ప్రతిఒక్కరి పనితీరు అద్భుతంగా ఉంది. మనం ఇలాంటి చిత్రాలు మరిన్ని చేయాలని ఆశిస్తున్నా" అని ప్రభాస్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

కాగా, నాని నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని మార్చి 30న ఈ చిత్రాన్ని వరల్డ్​ వైడ్​గా దాదాపు 3 వేలకుపైగా థియేటర్లలో గ్రాండ్​గా విడుదల చేశారు. రిలీజ్​ రోజు నుంచే తెలుగుతోపాటు మిగిలిన భాషల్లోనూ సూపర్​ హిట్​ టాక్‌ను దక్కించుకుంది. ధరణి, వెన్నెలగా నాని-కీర్తిసురేశ్‌ల యాక్టింగ్​ ఆకట్టుకుంటుందని అభిమానులు, సినీ ప్రియులు.. సోషల్‌మీడియా వేదికగా చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

దసరా కథేంటంటే.. తెలంగాణలోని సింగ‌రేణి ప్రాంతంలో.. 1995లో వీర్లపల్లి అనే ప్రాంతం చుట్టూ సాగే క‌థ ఇది. ధ‌ర‌ణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేశ్‌) ఈ ముగ్గురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తన స్నేహితుడు సూరి కోసం త‌న ప్రేమ‌నే త్యాగం చేసిన‌వాడు ధ‌ర‌ణి. రైళ్లలో బొగ్గు దొంగ‌త‌నం చేయ‌డం.. తాగ‌డం, స్నేహితులంతా క‌లసి తిర‌గ‌డం ఇదే వాళ్లు రోజూ చేసే పని. ఇలా సాఫీగా సాగుతున్న వారి జీవితాలను ఆ ఊరి సర్పంచ్​ ఎన్నికలు ఒక్కసారిగా కుదిపేస్తాయి. చిన్న నంబి (షైన్ టామ్ చాకో) పోటీ చేసిన ఆ ఎన్నిక‌లకు సూరితో పాటు అత‌ని స్నేహ‌బృందం.. రాజ‌న్న (సాయికుమార్‌)కి మద్దతుగా నిలిచి గెలిపించాక ఆ ఊళ్లో తీవ్ర సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటాయి. ఆ ప‌రిణామాలు ఎలాంటివి? ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు వచ్చయనేది మిగ‌తా క‌థ‌.

నాని 'దసరా'పై ప్రభాస్ కామెంట్స్​

ఇదీ చూడండి:బలగం చిత్రానికి మరో అంతర్జాతీయ అవార్డు.. సినిమా చూసి ఏడ్చేసిన జనం!

Last Updated : Apr 3, 2023, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details