OTT Releases This Week : ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ప్రేక్షకుడు ఏ సినిమా అయినా.. ఎక్కువగా ఓటీటీలో చూసేందుకే ఇష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీస్‌లు విడుదల చేస్తూ సినీ ప్రేక్షకులకు వినోదాలను పంచుతున్నాయి. అయితే ప్రతి వారం లాగానే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. ఇప్పటికే థియేటర్లో విడుదలై అలరించిన చిత్రాల్లో మొత్తం 9 సినిమాలు.. ఈ వారం ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్స్‌లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఈ వారం ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కడక్ సింగ్ :ఇప్పటికే థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించిన 'కడక్‌సింగ్' చిత్రం ఓటీటీల్లో విడుదలకు సిద్ధమైంది. మతిమరుపుతో బాధపడుతున్న ఆర్థిక నేరాల శాఖ అధికారి ఏకే శ్రీవాస్తవ చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. అతను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఒక స్కామ్ కేసును ఛేదిస్తాడు. అది ఎలాగో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. అయితే ఈ మూవీలో పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోతు, సంజన సంఘీ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 8న Zee5లో 'కడక్‌సింగ్' స్ట్రీమింగ్ కానుంది.
కీడా కోలా : ‘కీడా... ఇందులో ఉంది తేడా’ అంటూ సినిమాలో వినిపించే సంభాషణలాగే కొన్ని తేడాగా వ్యవహరించే పాత్రల చుట్టూ సాగే ఓ క్రైమ్ కామెడీ కథ ఇది. గమ్మత్తైన పాత్రలు, వాటి కోరికలు, అసంబద్ధంగా అనిపించే ప్రయత్నాలతో నవ్విస్తూ సాగుతుందీ చిత్రం. ఈ సినిమాలో చైతన్య మందాడి, రాగ్ మయూర్, బ్రహ్మానందం, విష్ణు ఓయ్, రఘు రామ్, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. డిసెంబర్ 8న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదల కానుంది.
ది అర్చీస్ : బాలీవుడ్ స్టార్ల వారసులు పలువురు కలిసి నటించిన చిత్రం 'ది అర్చీస్'. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్- శ్రీదేవి దంపతుల రెండో కుమార్తె ఖుషి కపూర్, అగ్ర నటుడు షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, మరో అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేరుగా ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్'లో డిసెంబరు 7న విడుదల కానుంది.
మా ఊరి పొలిమేర 2 : ఇక మొదటి పార్ట్ అనూహ్య విజయం తర్వాత వచ్చిన సినిమా 'మా ఊరి పొలిమేర 2'. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది. డిసెంబరు 8న ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో విడుదలకు సిద్ధమైంది. గోల్డ్ చందాదారులకు డిసెంబరు 7 నుంచే అందుబాటులో ఉండనుంది.
ఉచితంగా "నెట్‌ఫ్లిక్స్" సబ్స్క్రిప్షన్ కావాలా? మొబైల్ రీఛార్జ్ చేస్తే చాలు!!