OTT New Release Movies : ప్రతి వారం.. కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వారాంతం వచ్చిందంటే చాలు పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాలు నెల రోజులు తిరగకుండానే ఓటీటీ బాట పడుతున్నాయి. కొన్ని సినిమాలో థియేటర్స్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. ఓటీటీలో మాత్రం హిట్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా దాదాపు పది సినిమాలు థియేటర్స్లో.. అలాగే 10 సినిమాలు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నాయి. సినిమాలే కాదు ఆసక్తికర వెబ్ సిరీస్లు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఈ వారం యంగ్ హీరో నాగ శౌర్య నటించిన రంగబలి సినిమా కూడా ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. రంగబలి సినిమాతో పాటు ఇంకా ఏ ఏ సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయో తెలుసుకుందాం.
ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్
- హాట్‌స్టార్
దయ- తెలుగు వెబ్ సిరీస్ - అమెజాన్ ప్రైమ్
ద లాస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ ఎలైస్ హర్ట్ - ఇంగ్లీష్ సిరీస్ - ఆహా
హైవే - తమిళ సినిమా - సైనా ప్లే
డార్క్ షేడ్స్ ఆఫ్ సీక్రెట్ - మలయాళ సినిమా