తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమ్మ బాబోయ్.. ఫ్లైట్ జర్నీ​ కన్నా ఈ సినిమా టికెట్ ధరే ఎక్కువ! - oppenheimer movie hero

Oppenheimer Movie Ticket Price In India :హలీవుడ్ మూవీ 'ఓపెన్​హైమర్' సినిమా దేశవ్యాప్తంగా శుక్రవారం రిలీజైంది. కాగా ఈ సినిమా టిక్కెట్​ రేట్ల గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరి ఈ సినిమా టిక్కెట్ ధర ఎంతంటే!

Oppenheimer Movie Ticket Price In India
ఓపెన్​హైమర్ సినిమా టిక్కెట్ ధర

By

Published : Jul 21, 2023, 5:59 PM IST

Oppenheimer Movie Ticket Price In India : ఇంగ్లీష్ ఫిల్మ్​ మేకర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ఓపెన్​హైమర్' హాలీవుడ్ సినిమా భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. కాగా ఈ సినిమా మొదటి రోజు దేశవ్యాప్తంగా.. సుమారు 3 లక్షల టిక్కెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఈ సినిమా టిక్కెట్ ధర దేశంలో రికార్డు సృష్టించింది. దేశంలోని ఆయా ప్రముఖ నగరాల్లో ఒక్కో టిక్కెట్​ ధర రూ. 700 మొదలుకొని గరిష్ఠంగా రూ. 2450 (టాక్స్ కాకుండా) పలుకుతోంది. టిక్కెట్​కు ఇంత ధర ఉన్నప్పటికీ తొలిరోజు అన్ని థియేటర్లలో హౌజ్​ఫుల్​ షోస్ నడిచాయి. కాగా ముంబయిలోని ప్రముఖ మల్టీప్లెక్స్​ పీవీఆర్ఐకాన్​లో శుక్రవారం రాత్రి 7, 10 గంటల షోస్​కు టిక్కెట్​ ధర రూ.2450 గా ఉంది.

అయితే దేశంలో మిగతా ప్రాంతాలతో పోలిస్తే.. కశ్మీర్​లో ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ లభించింది. రానున్న వీకెండ్​లో టికెట్​ బుక్​ చేసుకునేవారికి నిరాశే మిగిలింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా కశ్మీర్ థియేటర్లలో హౌజ్​ఫుల్​ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కశ్మీర్​లో ఓ హాలీవుడ్​ సినిమాకు ఈ రేంజ్​లో ఆదరణ లభించడం ఇదే తొలిసారి. కాగా ఈ ఏడాది జనవరిలో బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్​ 'పఠాన్' సినిమా తర్వాత కశ్మీర్​లో హౌజ్​ఫుల్​ అయ్యింది ఈ సినిమాకే.

కాగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో.. జపాన్​పై వేసిన అణు బాంబులను కనుగొన్న జే. రాబర్ట్ ఓపెన్​హైమర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హీరో 'సిలియన్ మర్ఫీ' ఈ సినిమాలో నటన ఇరగదీశాడంటూ.. మూవీ చూసిన ఫ్యాన్స్​ అంటున్నారు. టిక్కెట్​ రేట్లు ఆకాశాన్నంటుతున్న తరుణంలో.. "కచ్చితంగా ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిందే. హీరో నటనకు గాను ఆస్కార్​ పక్కా. మాటల్లో వర్ణించలేని విధంగా మూవీని తెరకెక్కించారు" అంటూ సోషల్ మీడియాలో సినిమా చూసినవారు అభిప్రాయడుతున్నారు. దీంతో చిత్రంపై మరింత బజ్​ క్రియేట్​ అవుతోంది.

ఇక ఈ సినిమా పారిస్​లో జులై 11న విడుదల కాగా.. భారత్ సహా లండన్, న్యూయార్క్​ నగరంలో శుక్రవారం రిలీజైంది.

ABOUT THE AUTHOR

...view details