తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NTR ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్​.. తెలిస్తే పూనకాలే! - ఎన్టీఆర్ ఆది సినిమా రీరిలీజ్​

జూనియర్​ ఎన్టీఆర్​ అభిమానులకు శుభవార్త తెలిపారు నిర్మాత బెల్లంకొండ సురేశ్‌. ఏంటంటే?

NTR Aadi movie rerelease
ఎన్టీఆర్ ఆది రీరిలీజ్​

By

Published : Sep 26, 2022, 2:53 PM IST

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్లలో దర్శకుడు వి.వి. వినాయక్‌ హీరో ఎన్టీఆర్‌ కాంబో ఒకటి. తొలి ప్రయత్నం 'ఆది'తోనే ఈ ఇద్దరు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. 2002లో విడుదలైన ఈ సినిమా మాస్‌ కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది.

ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం.. ముఖ్యంగా 'అమ్మతోడు అడ్డంగా నరికేస్తా'... పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇప్పడీ చిత్రం విడుదలై 20 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదే విషయాన్ని తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ బయటపెట్టారు. ''ఆది' రీ రిలీజ్‌ కోసం సన్నాహాలు చేస్తున్నాం. గతేడాది కేవలం ఫ్యాన్స్‌ షో మాత్రమే వేశాం. కాకపోతే, ఈసారి ఎవరూ ఊహించని విధంగా భారీగా విడుదల చేయాలనుకుంటున్నాం. 'చెన్నకేశవరెడ్డి' రీ రిలీజ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది'' అని సురేశ్‌ వివరించారు.

ఈ ప్రకటనతో తారక్​ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో చిత్రాన్ని త్వరగా చూడాలనుకుంటున్నట్లు ట్వీట్స్‌ చేస్తున్నారు. ఇక, నవంబర్‌లో 'ఆది' రీ రిలీజ్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఆది రీరిలీజ్​
ఎన్టీఆర్ ఆది రీరిలీజ్​

ఇదీ చూడండి: మత్తు కళ్ల కయాదు.. 'ఈ అందంతోనే నువ్వు తెరను ఏలేయొచ్చు'

ABOUT THE AUTHOR

...view details