తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'స్పై'ఎఫెక్ట్.. ఆ దర్శకనిర్మాతలకు నిఖిల్ గట్టి కండిషన్! - నిఖిల్​ సిద్ధార్థ కండీషన్​

తాజాగా తాను నటించిన స్పై సినిమా నిరాశతో టాలీవుడ్​ స్టార్​ హీరో నిఖిల్​ సిద్ధార్థ తన అప్​కమింగ్​ మూవీస్​ విషయంలో జాగ్రత్తపడుతున్నారట. ఈ క్రమంలో తన నెక్స్ట్​ మూవీ స్వయంభు విషయంలో మూవీ మేకర్స్​కు ఓ కండీషన్​ పెట్టారంట. అదేంటంటే..

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 13, 2023, 2:11 PM IST

Nikhil Swayambhu Movie : యంగ్​ హీరో నిఖిల్​ సిద్ధార్థ లీడ్​ రోల్​లో రీసెంట్​గా వచ్చిన 'స్పై' సినిమా భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను నిరాశపరిచింది. నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ డెత్​ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయింది. ఇక దీని ఎఫెక్ట్ మూవీ టీమ్​ కంటే హీరో నిఖిల్​పైనే కాస్త గట్టిగా పడింది. పాన్ ఇండియా రేంజ్​లో ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ మంచి మార్కెట్​ను క్రియేట్​​ చేసుకుంటున్న సమయంలో ఇలాంటి టాక్​ రావడం వల్ల ఆయన కాస్త డీలా పడ్డారు. దీంతో ఈ సారి ఎలాగైనా గట్టి కమ్​బ్యాక్​ ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నారు.​ దీని కోసం తన తర్వాతి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా చురుగ్గా ఉండేందుకు ప్లాన్​ కూడా చేసుకుంటున్నారు.

Nikhil Upcoming Movies : ప్రస్తుతం నిఖిల్​ చేతిలో 'ది ఇండియా హౌస్'​, 'స్వయంభు', 'కార్తికేయ 3' లాంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. 'స్పై' సినిమా నిరాశ పరిచినందుకు ఆయన సోషల్​ మీడియా వేదికగా అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఓ నోట్ కూడా రిలీజ్​ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇకపై తాను ఇకపై నటించనున్న సినిమాలు మరింత హై స్టాండర్డ్స్​ క్వాలిటీతో ఉండేలా చూసుకుంటానని నిఖిల్​ అన్నారు. ఈ విషయంలో అస్సలు రాజీపడనని కూడా చెప్పారు. ఇక చెప్పినట్టుగానే ఆయన అప్​కమింగ్​ మూవీ 'స్వయంభు' విషయంలో దర్శక నిర్మాతలకు ఓ కండీషన్​ పెట్టారట.

పీరియాడిక్​ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ పై భువన్, శ్రీకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్​ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో నిఖిల్​ ఓ యోధుడిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ మూవీ కోసం నిఖిల్​ ఏ విషయంలో రాజీ పడకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొదటి నుంచి ప్రతీది దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. ఫైనల్​ అవుట్​పుట్​ ​ విషయంలో తాను సంతృప్తి చెందితే కానీ సినిమా రిలీజ్ చేయకూడదన్న విషయాన్ని దర్శకనిర్మాతలతో​ తేల్చి చెప్పారని టాక్​.

Nikhi Movies : మరోవైపు నిఖిల్.. గత కొంతకాలంగా తన రేంజ్​ను పెంచే సినిమాలనే ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకు సాగుతున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ వాటితో మంచి టాక్​ను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన 'కార్తికేయ 2'తో దేశవ్యాప్తంగా భారీ హిట్​ అందుకున్నారు. రూ.100 కోట్ల మేర బాక్సాఫీస్​ వసూళ్లను సాధించారు. ఈ సినిమాతోనే నార్త్​ ఆడియెన్స్​ ఫోకస్​ నిఖిల్​పై పడింది. అలానే అక్కడి మార్కెట్​ కూడా క్రమ క్రమంగా పెరిగింది. దర్శక నిర్మాతలు కూడా ఆయనతో భారీ బడ్జెట్​ చిత్రాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details