Nani 30 Title Glimpse : నేచురల్ స్టార్ నాని, 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకుర్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న 'నాని 30' సినిమా టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. 'హాయ్ నాన్న' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. మనసును హత్తుకునేలా ఉన్న ఈ ఎమోషనల్ డ్రామాకు సంబంధించిన గ్లింప్స్‌ను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.
Hi Nanna Glimpse : ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, నాని కూతురిగా నటిస్తున్న పాప కనిపిస్తుంది. ఇక మృణాల్ ఠాకూర్.. నానిని 'హాయ్ నాన్న' అనడం గ్లింప్స్‌లో ఆసక్తికరంగా ఉంది. దీంతో ఈ ముగ్గురి బాండింగ్‌కు సంబంధించి సినిమాలో ఓ కీలకమైన మలుపు ఉన్నట్లు హింట్ ఇచ్చేశారు మేకర్స్. గతంలో 'జెర్సీ' సినిమాతో నాన్న ఎమోషన్ చూపించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించిన నాని... మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి ఆడియెన్స్‌ను కంటతడి పెట్టించేందుకు రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. మరోవైపు 'సలార్' బ్యూటీ శ్రుతి హాసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది.