తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Nani 30 Movie Title : 'నాని 30' మూవీ టైటిల్​ అదేనా? - నాని 30 ఫస్ట్​ లుక్​

Nani 30 Movie Title : నేచురల్​ స్టార్​ నాని ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు 'నాని 30' అనే వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కోసం కొన్ని టైటిల్స్​ను పరిశీలిస్తున్నారట మూవీ మేకర్స్​. అవేంటంటే?

Nani 30 Title
Nani 30 Title

By

Published : Jul 11, 2023, 8:41 PM IST

Updated : Jul 11, 2023, 9:59 PM IST

Nani 30 Title : తన నేచురల్​​ యాక్టింగ్​తో తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు టాలీవుడ్​ స్టార్ హీరో నాని. అప్పట్లో వచ్చిన 'అష్టాచమ్మా' నుంచి ఇటీవల వచ్చిన 'దసరా' సినిమా వరకు అన్నింటిలో తనదైన శైలి నటనతో మంచి గుర్తింపు పొందారు. ఇక ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను పట్టాలెక్కించే స్టార్స్​లో నాని ఒకరు. సమ్మర్​లో 'దసరా' సినిమాతో ఊర మాస్​ లుక్​లో కనిపించి హిట్​ టాక్ అందుకున్న నాని.. గ్యాప్​ తీసుకోకుండా మరో సినిమా షూటింగ్​లో బిజీ అయిపోయారు. 'నాని 30' అనే వర్కింగ్​ టైటిల్​తో చిత్రీకరణ జరుపుకుంటోంది ఈ సినిమా. ఎప్పడూ కొత్త దర్శకులను ప్రోత్సహించే​ నేచురల్ స్టార్​.. ఈ సారి కూడా శౌర్యవ్ అనే కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. శౌర్యవ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాని సరసన 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.

చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్​. తండ్రి-కుమార్తె మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నందున..'హలో డాడీ', 'హాయ్ డాడీ', 'డియర్ డాడీ' లాంటి పేర్లను పరిశీలిస్తున్నారట. దాదాపు 'హలో డాడీ' అనే పేరును ఖరారు​ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Nani 30 Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో నాని కుమార్తె పాత్రలో కియారా ఖన్నా అనే చిన్నారి నటిస్తోంది. ప్రీ టీజర్ చూస్తుంటే ఇది తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే కథగా అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'డాడీ' సినిమా తరహాలో ఇది ఉండనుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 'వైరా ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్​పై ఈ సినిమాను మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

గాల్లో తేలుతూ.. గ్లింప్స్​!
Nani 30 Glimpse : తన సినిమాల ప్రమోషన్లను డిఫరెంట్​గా ఉండేలా చూస్తుంటారు నాని. ఈ క్రమంలో 'నాని 30' మూవీ ఫస్ట్ లుక్, గ్లింప్స్​కు సంబంధించిన అనౌన్స్‌మెంట్​ను పారాగ్లైడింగ్ చేస్తూ చెప్పారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను అభిమానుల కోసం తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు. జులై 13 ఆ అప్డేట్స్​ ప్రేక్షకుల ముందుకు రానున్నాయంటూ చెప్పుకొచ్చారు.

Last Updated : Jul 11, 2023, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details