తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

నటసింహం నయా అవతార్​.. IPLకు 'కామెంటేటర్'​గా బాలయ్య.. ఫ్యాన్స్​కు పూనకాలే! - ఐపీఎల్​లో బాలకృష్ణ కామెంటరీ

నటుడిగా, వ్యాఖ్యాతగా తనదైన స్టైల్​లో ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. త్వరలోనే కామెంటేటర్​ అవతారమెత్తనున్నారు. అది కూడా ప్రతిష్ఠాత్మక ఐపీఎల్​ మ్యాచ్​ కోసం. ఆ వివరాలు..

nandamuri balakrishna commentary for ipl opening ceremony
nandamuri balakrishna commentary for ipl opening ceremony

By

Published : Mar 26, 2023, 1:32 PM IST

Updated : Mar 26, 2023, 1:45 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే కామెంటేటర్​గా నయా అవతార్​ ఎత్తనున్నారు. మార్చి 31న ప్రారంభమవ్వనున్న ప్రతిష్ఠాత్మక ఐపీఎల్​ ఓపెనింగ్​ సెర్మనీలో ఆయన సందడి చేయనున్నారు. చెన్నై సూపర్​ కింగ్స్, గుజరాత్​ టైటాన్స్​ మధ్య జరగనున్న తొలి ఐపీఎల్​ మ్యాచ్​కు ఆయన కామెంటేటర్​గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని స్టార్​ స్పోర్ట్స్​ సంస్థ వెల్లడించింది.

"ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్​.. ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్.. నందమూరి బాలకృష్ణ గారు.. తెలుగుజాతి గర్వపడేలా, సంబరాన్ని అంబరాన్ని అంటేలా ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్​లో ఉండబోతుంది" అంటూ స్టార్​ స్పోర్ట్స్​ సంస్థ వీడియో షేర్​ చేసింది. వీడియోలో బాలయ్య లుక్​ అదిరిపోయింది. నటిసింహానికి స్టార్​ స్పోర్ట్స్​ ప్రతినిధులు.. స్పెషల్​ బ్యాట్​ను బహుకరించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడారు.

"నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకించి నాకు క్రికెట్​ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీ రోజుల్లో కూడా క్రికెట్​పై నేను చాలా మక్కువ చూపించేవాడని. మళ్లీ తిరిగి కామెంటేటర్​గా రావడమనేది ఆట ఆడే అంత సంతృప్తినిస్తుంది. హుషార్​ ఆన్.. గేమ్​ ఆన్​.. స్టార్​ స్పోర్ట్స్​.. తెలుగు ఆన్​" అంటూ బాలయ్య మంచి జోష్​లో చెప్పారు.

అయితే ఐపీఎల్​ తొలి మ్యాచ్​కు కామెంటేటర్​గా బాలయ్య వ్యవహరిస్తారన్న విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. ఐపీఎల్​లో బాలయ్య రోర్ వినిపించనుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. ఆహా ఓటీటీలో అన్​స్టాపబుల్​ టాక్​ షోలో హోస్ట్​గా అదరగొట్టిన బాలకృష్ణ.. ఐపీఎల్​లో తన కామెంటరీతో అలరిస్తారని అభిమానులు అంటున్నారు.

వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ యువ హీరోలకు సవాళ్‌ విసురుతున్నారు నందమూరి బాలకృష్ణ. గతేడాది విడుదలైన 'అఖండ'లో బాలయ్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అదే ఊపు​లో వీరసింహా రెడ్డి చిత్రంలో నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఆ సినిమా.. విజయం సాధించింది. ఇప్పుడే అదే జోష్​లో బాలయ్య.. తన 108వ సినిమా చేస్తున్నారు. అనిల్​ రావిపూడి దర్శకత్వంలో NBK 108 వర్కింగ్​ టైటిల్​తో ఈ సినిమాతో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం​ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో బాలకృష్ణ సరసన కాజల్​ అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తున్నారు. యంగ్​ హీరోయిన్​ శ్రీలీల.. బాలయ్య కుమార్తెగా నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు బాలయ్య 109వ చిత్రం.. మాస్​ డైెరెక్టర్​ బోయపాటి శ్రీనుతో తీస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ మాస్​ ప్రాజెక్ట్​ను బాలకృష్ణ పుట్టినరోజున ప్రకటిస్తారని సమాచారం.

Last Updated : Mar 26, 2023, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details