తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సామ్ హార్డ్ వర్కర్​.. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది' - సమంత నాగచైతన్య రిలేషన్​షిప్

అక్కినేని నాగచైతన్య, నటి కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం 'కస్టడీ'. ఈ సిమిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అలా ఓ ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంత గురించి అడగ్గా... ఆయన పాజిటీవ్​గా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే...

Naga chaithanya Samantha
నాగచైతన్య సమంత

By

Published : May 12, 2023, 10:03 AM IST

టాలీవుడ్​ స్టార్​ హీరో నాగచైతన్య ఇటీవలే తన కస్టడీ మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో పలు ఈవెంట్లలో పాల్గొంటున్న ఆయన తనతో పాటు సామ్​ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో 'జోష్​' సినిమా నుంచి ఇప్పటివరకూ తాను వర్క్‌ చేసిన కోస్టార్స్‌లో ఆయనకు నచ్చిన క్వాలిటీస్‌ గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా తన కో స్టార్​ సమంత గురించి ఓ ఆసక్తికర కామెంట్​ చేశారు. ఇంతకీ ఆయన ఎవరెవరి గురించి మాట్లాడారంటే..

సమంత..సమంత హార్డ్‌వర్కర్‌. చేసే పనిలో 100 శాతం నిమగ్నమై ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఏదైనా అనుకుంటే కచ్చితంగా ఆ పని చేసి తీరుతుంది. 'మజిలీ' తర్వాత సామ్‌ నటించిన 'ఫ్యామిలీమ్యాన్‌', 'ఓ బేబీ' సినిమాలు నాకెంతో నచ్చాయి. రీసెంట్​గా రిలీజైన ఆమె సినిమా 'యశోద' కూడా చూశాను అని చై వివరించారు.
పూజాహెగ్డే.. పూజా స్టైల్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆమె సెట్స్​లో చాలా యాక్టీవ్​గా ఉంటుంది.
కృతిశెట్టి .. కృతి అమాయకత్వం చూడముచ్చటగా ఉంటుంది. అద్భుతమైన చిత్రాల్లో నటించాలనే తపన తనలో ఉంది. ప్రతిరోజూ సెట్‌కు రాగానే పాత్ర గురించి, సీన్స్‌ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది.
సాయిపల్లవి.. డ్యాన్స్‌ అద్భుతంగా చేస్తుంది. 'లవ్​స్టోరీ' సినిమాలో ఆమె ఉండటం వల్లే డ్యాన్స్‌ రిహార్సల్స్‌ కోసం ఎక్కువ గంటలు కేటాయించాను.
శ్రుతిహాసన్‌.. శ్రుతి మల్టీ టాలెంటెడ్‌.. వాల్ల నాన్నకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె పాటలు నాకు నచ్చుతాయి.
అనంతరం ఆయన సమంత నుంచి విడిపోయిన విషయంపై స్పందిస్తూ.. 'మా మధ్య ఏదైతే జరిగిన సంఘటనలు దురదృష్టకరం. మేము విడిపోయినప్పుడు ఎన్నో పుకార్లు వచ్చాయి. కొంతమంది గాసిప్స్‌ క్రియేట్‌ చేస్తూ వార్తలు రాశారు. వాటిని చూసి చాలా ఇబ్బందిపడ్డా. మా గురించి ఎందుకు ఇంతలా వార్తలు సృష్టిస్తున్నారో అర్ధం కాలేదు. కొంతమంది ఛానెళ్ల టీఆర్​పీ కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా అవసరం లేదు కదా అనిపించింది. రోజులు గడిచే కొద్ది వాటిని పట్టించుకోవడం మానేశా. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చింది వృత్తిపరమైన జీవితంతో ప్రేక్షకులను అలరించడానికి.. వ్యక్తిగత జీవితంతో ఎంటర్‌టైన్‌ చేయడానికి కాదు. అలా, నా వృత్తిపై మరింత దృష్టి పెట్టి ముందుకు సాగుతున్న' అని ఆయన పేర్కొన్నారు.

ఇక కస్టడీ సినిమా శుక్రవారం(మే 12) నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. నాగచైతన్య ఇప్పటివరకూ లవర్​ ​బాయ్​గా, డీసెంట్​ పాత్రల్లో ప్రేక్షకులను అలరించినా... మాస్​ యాక్షన్ ఎంటర్​టైన్​మెంట్​ విషయానికి వచ్చేలోపు ఆడియోన్స్​ మెప్పించలేకపోయారు. ఇప్పుడు 'కస్టడీ'లో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వచ్చారు. ఇప్పటికే ప్రీమియర్​ షోస్​ చూసిన ఆడియన్స్​ నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details