Mrunal Thakur Badshah Dating : గత కొద్దిరోజులుగా 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్.. ప్రముఖ సింగర్‌తో డేటింగ్లో ఉందంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు బాద్షా. దీనిపై వివరణ ఇస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నోట్‌ను పోస్ట్ చేశారు. తమ ఇద్దరి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని.. అవి పూర్తిగా అవాస్తవం అని కొట్టి పారేశారు.
అసలేం జరిగిందంటే..?
దీపావళి సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి సెలబ్రిటీలకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ వేడుకకు మృణాల్ ఠాకూర్, సింగర్ బాద్షా కూడా హాజరయ్యారు. ఇక్కడ శిల్పా శెట్టి, బాద్షాలతో కలిసి మృణాల్ పలు ఫొటోలు దిగారు. అనంతరం వాటిని తన ఇన్‌స్టా హ్యాండిల్లో షేర్ చేస్తూ.. 'నాకు అత్యంత ఇష్టమైన వారు' అని క్యాప్షన్‌ను కూడా జోడించారు.
చేతిలో చేయి వేసి..
అయితే ఈ ఫొటోల్లో మృణాల్.. బాద్షాతో అత్యంత చనువుగా ఉంటూ కనిపించింది. పార్టీలో కలియతిరుగుతున్న సమయంలో ఇద్దరు చేతులు పట్టుకొని మరీ తిరుగుతూ కనిపించారు. ఇక పార్టీ అయిపోయాక కూడా ఇద్దరూ కలిసి ఒకే కారులో వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ, ప్రేమలో పడ్డారంటూ జోరుగా ప్రచారం కూడా సాగింది. ఇది కాస్త వైరల్‌గా మారడం వల్ల తాజాగా దీనిపై స్పందించారు బాద్షా. 'డియర్ ఇంటర్నెట్.. మరోసారి నిరాశపరుస్తున్నందుకు క్షమించు, ప్రస్తుతం వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవి పూర్తిగా అవాస్తవం' అంటూ ఓ ఫన్నీ ఎమోజీని నోట్‌కి యాడ్ చేస్తు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్‌తో మృణాల్‌పై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయింది.