Most Profitable Indian Film Of 2023 : ఈ ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ ముందు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. బడ్జెట్ విషయంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్నీ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వచ్చాయి. ఇందులో కొన్ని మంచి టాక్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపించాయి. ఇలా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల జాబితాలో 'పఠాన్', 'వారిసు', 'పొన్నియిన్ సెల్వన్ 2' వంటి సినిమాలు ఉండగా.. తాజాగా ఈ లిస్ట్‌లోకి 'గదర్ 2', 'జైలర్' సినిమాలు వచ్చాయి.
ఈ ఏడాది ఆ సినిమానే టాప్..ఇలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలకు .. ఎక్కువ కలెక్షన్లు ఉన్నప్పటికీ అత్యధిక లాభాలు అందుకోలేకపోయాయి. అయితే కేవలం 15 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి స్టార్స్ లేకుండా తెరకెక్కిన ఓ చిన్న సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ ముందు లాభాల పంట పండించింది. అదే పాన్ఇండియా మూవీ 'కేరళ స్టోరీ' (The Kerala Story). 2023 మే లో విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అత్యధిక లాభాలను అర్జించి రికార్డుకెక్కింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ లీడ్ రోల్లో కనిపించారు.
సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 303 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా గ్లోబల్ నెట్ హాల్ కూడా రూ. 250 కోట్లకు పైగా దాటింది. ఈ సినిమా నిర్మాణానికి అయిన ఖర్చుతో పోలిస్తే 1500% పైగా లాభాన్ని అర్జించింది. అలా ఇటీవలే విడుదలైన 'పఠాన్', 'గదర్ 2', 'జైలర్' లాంటి సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది.
ఆ మూడు చిత్రాలకు ఎన్ని లాభాలు వచ్చాయంటే..బాలీవుడ్ బాద్షా నటించిన 'పఠాన్' సినిమా.. సుమారు ఎనిమిది నెలల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు రూ. 1050 కోట్ల మేర వసూళ్లు సంపాదించింది. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన 'పఠాన్'.. 240 శాతం లాభాన్ని పొంది దూసుకెళ్లింది. అయినప్పటికీ కేరళ స్టోరీ అందుకున్న లాభాల శాతం ముందు ఇది తక్కువే.