Fire Accident At Ranbir Film Set: మహారాష్ట్రలోని ముంబయి శివారు అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ మైదానంలో పక్క పక్కనే వేసిన రెండు సినిమా సెట్టింగులో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. సాయంత్రం 4.30 గంటలకు మొదలైన మంటలు రాత్రి తొమ్మిదిన్నరకు అదుపులోకి వచ్చాయి. ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, అయిదు నీటి జెట్టీలతో సిబ్బంది శ్రమించారు.
ఈ సెట్టింగుల్లో ఒకచోట రాజశ్రీ ప్రొడక్షన్స్ చిత్రం, మరోచోట డైరక్టర్ లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్బీర్- శ్రద్ధా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త మూవీ చిత్రీకరణలు జరుగుతుండగా అగ్గి రాజుకొన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనీశ్ దేవాశీ (32) అనే యువకుణ్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.