Actress Kalyani Kurale Jadhav Passes Away: మరాఠీ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీరియల్ 'తుజ్యాత్ జీవ్ రంగాల' ఫేమ్ నటి కల్యాణి కుర్లే జాదవ్ మరణించారు. కొద్దిరోజుల క్రితమే తాను ప్రారంభించిన హోటల్ మూసి వస్తుండగా లోడ్ లారీ ఢీకొని దుర్మరణం పాలయ్యారు.
మరో విషాదం.. లారీ ఢీకొని ప్రముఖ సీరియల్ నటి దుర్మరణం - కల్యాణి కుర్లే జాదవ్ వార్తలు
Actress Kalyani Kurale Jadhav Passes Away: ప్రముఖ సీరియల్ నటి కల్యాణి కుర్లే జాదవ్.. ఘెర రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తాను సొంతంగా ప్రారంభించిన హోటల్‌ను మూసి తిరిగి ఇంటికి వెళ్తుండగా లోడ్ లారీ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటి కల్యాణి కుర్లే జాదవ్.. కొల్హాపుర్-సాంగ్లీ జాతీయరహదారిపై హాలండ్ సమీపంలో 'ప్రేమచి భక్రీ' పేరుతో హోటల్‌ను కొద్దిరోజుల క్రితమే ప్రారంభించారు. ఆమె కొల్హాపుర్ నగంలో మహావీర్ కాలేజీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే శుక్రవారం రాత్రి.. కల్యాణి కుర్లే తన హోటల్‌ను మూసివేసి ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో హైవేపై వేగంగా వస్తున్న ఓ డంపర్ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే ఆ ప్రాంతంలో రోడ్డుపై గుంతలు ఎక్కువగా ఉన్నాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే గుంతలను పూడ్చాలని స్థానిక రైతులు ఆందోళన చేపట్టారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం కనీసం చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.