రజనీకాంత్, మణిరత్నం కలయికలో ఓ సినిమా రాబోతుందా? అంటే అవుననే మాట తమిళ సినీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన 'దళపతి' అప్పట్లో భారీ విజయం అందుకుంది. రజనీకాంత్‌తో లైకా ప్రొడక్షన్స్ రెండు చిత్రాలను నిర్మించబోతున్నదంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒక దానికి శిబి చక్రవర్తి దర్శకుడు కాగా రెండో చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ప్రస్తుతం 'పొన్నియిన్ సెల్వన్ 2' చిత్రాన్ని తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఈ సినిమా విడుదల కంటే ముందే రజనీతో సినిమాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మణిరత్నం దర్శకత్వంలో రజనీ.. ఒకేరోజు ఖాన్‌ల సందడి - షారుక్ ఖాన్ పఠాన్ టీజర్
భారత చిత్రసీమ స్టార్ హీరోలు రజనీకాంత్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ చిత్రాలకు సంబంధించి కొత్త వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులు..
ఒకేరోజు సందడి.. హిందీ చిత్రసీమలో షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్...ఇద్దరూ అగ్ర కథానాయకులే. ఇద్దరికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులన్నారు. షారుక్ నుంచి 'పఠాన్' సినిమా రాబోతుంది. సల్మాన్ నుంచి 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' విడుదల కానుంది. మరి ఈ రెండు చిత్రాలు ఎలా ఉండబోతున్నాయో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ఆసక్తికి ఒకేరోజు తెరపడనుంది. 'పఠాన్', 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' టీజర్‌లు ఈ నెల 23నే ప్రేక్షకుల్ని అలరించనున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న 'పఠాన్'లో సల్మాన్ అతిథి పాత్రలో నటించడం మరో ఆకర్షణ. ఇందులో దీపికా పదుకొణె నాయిక కాగా జాన్ అబ్రహం విలన్‌గా నటిస్తున్నాడు. ఇక 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'ను ఫర్హాద్ సామ్‌జీ తెరకెక్కిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ విషయంలో అందుకే వెనకడుగు వేశా.. ఇప్పుడలా కాదు: చిరంజీవి