తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మహేశ్​ కోసం ఇండోనేషియన్ బ్యూటీ - RRR ఒలీవియాకు పోటీగా! - Elizabeth Chelsea mahesh

Mahesh Babu Rajamouli Movie : భారీ అంచనాల నడుమ స్క్రిప్ట్​ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్న మహేశ్​ రాజమౌళి మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్​డేట్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. మహేశ్​ సరసన ఓ ఇండోనేషియా భామను తీసుకురానున్నారట. ఆ విశేషాలు మీ కోసం..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2024, 10:08 AM IST

Updated : Jan 7, 2024, 2:27 PM IST

Mahesh Babu Rajamouli Movie :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, స్టార్​ డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తున్న మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతుండగా అభిమానులు ఈ చిత్రం నుంచి మరిన్ని అప్​డేట్స్ రావాలంటూ వెయిట్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కోసం జక్కన్న మరో భారీ ప్లానే వేశారట.

ఇందులో మహేశ్ బాబు సరసన నటించేందుకు ఓ ఇండోనేషియా భామను రాజమౌళి తీసుకురానున్నారట. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోన్న ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్​ను ఆయన ఈ మేరకు ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెకు స్క్రీన్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారట. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్​ చేయలేదు. కానీ మహేశ్​ అభిమానులు మాత్రం ఈ రూమర్ నిజమైతే బాగుండు అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు. జక్కన్న టీమ్ ఇప్పటికైనా ఈ మూవీకి సంబంధించి అప్​డేట్స్​​ ఇవ్వాలంటూ రిక్వెస్ట్​ చేస్తున్నారు.

Mahesh Babu Rajamouli Movie Budget : తాజాగా ఈ సినిమా గురించి మరి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను రూ.1,500 కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఈ సినిమా కోసం సుమారు రూ.100 కోట్లతో ఓ ప్రత్యేకమైన భారీ సెట్​ ఏర్పాటు చేస్తున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై అటు హీరో మహేశ్​ బాబు గానీ, ఇటు డైరెక్టర్​ రాజమౌళి గానీ అధికారికంగా ఎటువంటి విషయాన్ని వెల్లడించలేదు. కనీసం హింట్​ కూడా ఇవ్వలేదు. మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్​లో ప్రారంభమవుతుందంటూ ఇంతకుముందు వార్తలు కూడా వచ్చాయి. దీనిపై కూడా చిత్ర యూనిట్ స్పందించలేదు. దీంతో ఈ రూమర్స్​కు ఆన్సర్స్​ కోసం ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్నట్లు నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

అప్పుడే ధైర్యం వచ్చింది, ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేను - మహేశ్ బాబు

Mahesh Rajamouli Movie : జక్కన్న - మహేశ్ సినిమాలో విలన్​గా టాలీవుడ్ స్టార్ హీరో!

Last Updated : Jan 7, 2024, 2:27 PM IST

ABOUT THE AUTHOR

...view details